బాలయ్యకు ఎలా పిలిస్తే ఇష్టమో తెలుసా?

Bala-Is-The-Nick-Name-For-N

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోల్లో బాలయ్య ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు. ఇతర ముగ్గురు స్టార్‌ హీరోలతో పోల్చితే ఈయన కాస్త ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఈ వయస్సులో కూడా ఎనర్జిటిక్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకు వెళ్తున్న బాలయ్య ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా అందరిని హుషారెత్తిస్తాడు. తాజాగా ఈయన ‘పైసా వసూల్‌’ సినిమాలో నటించాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బాలయ్య ఎంత ఉత్సాహంగా పాల్గొన్నాడో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రానా షో నెం.1 యారిలో బాలయ్య ఎనర్జీకి అంతా షాక్‌ అయ్యారు. తనకు ఆప్తులైన వారికి ఎంతో ప్రేమను బాలయ్య పంచుతాడనే విషయం తెల్సిందే. తాజాగా ‘పైసా వసూల్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సరదా సన్నివేశాన్ని బాలయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన సమయంలో నన్ను ఎప్పుడు సర్‌ అంటూ దర్శకుడు పూరి పిలుస్తుండేవాడు. కాని నాకు ఆ పిలుపు నచ్చలేదు. నన్ను బాలా అని పిలవాలంటూ గట్టిగా చెప్పి మరీ పిలిపించుకున్నాను. బాలా అని పిలిస్తే నాకు ఇష్టమని, నా అనుకున్న వారు అలా పిలుస్తారని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఒక్క సినిమాతోనే పూరితో చాలా సన్నిహిత్యం పెరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. మొదట పూరితో సినిమా వద్దని చాలా మంది వారించారు. కాని ఆయనపై నాకు నమ్మకం ఉంది, ఆయన నాతో ఒక మంచి సినిమా చేస్తాడనే అభిప్రాయంతో పైసా వసూల్‌ చేశాను, ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తుందని బాలయ్య అన్నాడు.

మరిన్ని వార్తలు:

కుశ టీజర్‌ వచ్చేస్తోంది

అల్లరోడికి ఎంతటి దుస్థితి పట్టింది!