కుశ టీజర్‌ వచ్చేస్తోంది

introducing-kusa-first-look-teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటీవల ఆడియో విడుదలైన ఈ సినిమా నుండి మరో టీజర్‌ రాబోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఆ మూడు పాత్రల్లో రెండు పాత్రలైన జై మరియు లవకుమార్‌లకు సంబంధించిన టీజర్‌లు విడుదల అయ్యాయి. కుశ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు కుశ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎన్టీఆర్‌ సిద్దం అయ్యాడు. జై మరియు లవకుమార్‌ల టీజర్‌లు సినిమాపై అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లిన నేపథ్యంలో కుశ టీజర్‌ కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు మరియు అభిమానులున్నారు. రేపు ఉదయం 10 గంటలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రికార్డు స్థాయిలో జై లవకుశ చిత్ర బిజినెస్‌ జరుగుతుంది. విడుదల భారీగా ఉండబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఆడియోను డైరెక్ట్‌గా విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఈనెల 10న ప్రీ రిలీజ్‌ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. ఆ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. సినిమాను దసరా కానుకగా ఈనెల 21న విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో రికార్డు స్థాయి వసూళ్లను ఈ సినిమా సాధించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

సీడెడ్‌లో పవర్‌ చూపుతున్న బాలయ్య

దీక్షకు లక్కీ ఛాన్స్‌