దేవసేన కూడా అర్జున్‌ రెడ్డి అభిమాని

Baahubali heroine Anushka Shetty praises Arjun Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సినీ ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికి లేపేస్తున్నారు. మొదట ఈ సినిమాపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రశంసలు కురిపించాడు. తాను తెరకెక్కించిన ‘శివ’ సినిమా కంటే అద్బుతంగా ఉందని, విజయ్‌ నటన సూపర్బ్‌ అంటూ పు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మహేష్‌బాబు, రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తిన వారిలో ఉన్నారు. తాజాగా ‘బాహుబలి’ దేవసేన అనుష్కకు కూడా ‘అర్జున్‌ రెడ్డి’ తెగ నచ్చేసినట్లుగా ఉన్నాడు.

అనుష్క తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూసిందట. సినిమా చూసిన అనుష్క తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్‌ చేసుకుంది. అర్జున్‌ రెడ్డి తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ పేర్కొంది. అర్జున్‌ రెడ్డి సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నిజాయితితో మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దర్శకుడు, నిర్మాత, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్‌ రామకృష్ణ ఇలా ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్‌ అనిపించే సినిమాను చేసినందుకు వారిని అభినందిస్తున్నాను అంటూ అనుష్క పోస్ట్‌ చేసింది. అనుష్క ‘అర్జున్‌ రెడ్డి’ రివ్యూకు సోషల్‌ మీడియాలో భారీ రెస్పాన్స్‌ వస్తుంది. అనుష్క పోస్ట్‌కు భారీగా కామెంట్స్‌, లైక్స్‌ షేర్స్‌ దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈమె ‘భాగమతి’ అనే చిత్రంలో నటించడంతో పాటు బరువు తగ్గే పనిలో ఉంది. త్వరలోనే కొత్త సినిమాలకు సైన్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డిని తిరష్కరించిన అందాల రాక్షసి?

‘ఫిదా’ చేసిన వరుణ్‌ ‘తొలిప్రేమ’

మెగా ఫ్యాన్స్‌కు ‘సైరా’ బ్యాడ్‌ న్యూస్‌