అర్జున్‌ రెడ్డిని తిరష్కరించిన అందాల రాక్షసి?

lavanya-tripathi-rejector-with-vijay-devarakonda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కాస్త విజయ్‌ దేవరకొండను స్టార్‌ను చేసింది. మహేష్‌బాబు, రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి వారు కూడా విజయ్‌ దేవరకొండ అద్బుతమైన నటుడు అంటూ ప్రశంసించారు. అంతటి విజయ్‌ దేవరకొండతో కలిసి నటించేందుకు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నో చెప్పి అందరికి షాకిచ్చింది. 

తాజాగా లావణ్య త్రిపాఠి, నాగచైతన్యతో కలిసి ‘యుద్దం శరణం’ చిత్రంలో నటించింది. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఈమెకు వరుసగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. పరశురాం దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఒక సినిమాను అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయాలని భావించారు. కాని లావణ్య త్రిపాటి మాత్రం బిజీ అంటూ విజయ్‌కి నో చెప్పింది. స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్న ఈ సమయంలో విజయ్‌కి ఓకే చెప్పడం వల్ల ఇమేజ్‌ డ్యామేజీ అవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. మంచి పారితోషికంను కూడా కాదని, గీతాఆర్ట్స్‌లో నటించే అవకాశంను వదులుకుంది.

మరిన్ని వార్తలు:

మోక్షు సినీ ఎంట్రీ పై బాలయ్య స్వీట్ న్యూస్.

కొత్త భాష‌లు నేర్చుకుంటున్న ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ‌

అర్జున్ రెడ్డి 3 గంట‌ల 40 నిమిషాలు?