మోక్షు సినీ ఎంట్రీ పై బాలయ్య స్వీట్ న్యూస్.

balakrishna comments on Mokshagna movie entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి వంశం నుంచి ఇంకో హీరో వెండితెర మీదకి రానున్నాడు. ఆయన ఇంకెవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. నేడు మోక్షు పుట్టిన రోజు సందర్భంగా హిందూపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న బాలయ్య కొడుకు సినీ రంగ ప్రవేశం మీద కీలక ప్రకటన చేశారు. ఈ సెప్టెంబర్ 6 తో మోక్షజ్ఞ కి 21 ఏళ్ళు వచ్చాయి. ఎప్పటినుంచో మోక్షు సినిమా రంగప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రకటన వెనక్కి పోతూనే వుంది. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా  ఫ్యాన్స్  ఎదురు చూసిన స్టేట్ మెంట్ ఇచ్చేసారు బాలయ్య.

వచ్చే జూన్ నాటికల్లా మోక్షజ్ఞ సినిమా ప్రారంభం అవుతుందని బాలయ్య ప్రకటించారు. అది కూడా నందమూరి కుటుంబాన్ని సినీ రంగంలోనే గాకుండా రాజకీయంగా కూడా ఆశీర్వదిస్తున్న హిందూపురం నుంచి ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ తొలి సినిమా బాధ్యతని నిర్మాత సాయి కొర్రపాటి చేతుల్లో పెట్టొచ్చని తెలుస్తోంది. ఓ ప్రేమ కథతో మోక్షుని వెండితెరకి పరిచయం చేయాలని చూస్తున్నారు బాలయ్య. ఇక దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆ జాబితాలో సాయి కొర్రపాటి సన్నిహితుడు అయిన రాజమౌళి పేరు కూడా అక్కడక్కడా వినిపిస్తోంది. అయితే పూర్తి వివరాలు బాలయ్య చెప్తే గానీ దర్శకుడి పేరు ఫైనల్ అయినట్టు కాదు.

మరిన్ని వార్తలు:

డేరాలో బాలీవుడ్ తారలు

సింధు ప్ర‌త్య‌ర్థి సోనూ సూద్

కొత్త భాష‌లు నేర్చుకుంటున్న ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ‌