ఎవరో రావాలి, ఏదో చేయాలి… జగన్ ఎదురుచూపులు.

Ys jagan tension about on andhra pradesh before elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎండా కాలంలో జరగాల్సిన ఎన్నికలు ముందుకు రాబోతున్నాయా?….ఔను ఔననే సంకేతాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనిపిస్తున్నాయి. అందులో నిజం వుందో, లేదో అని ఆరా తీసుకున్న జగన్ కి 2018 డిసెంబర్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తేలిందట. దీంతో ఆయన షాక్ లో ఉన్నారంట. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ అన్న మాట వినడానికే ఆయన భయపడుతున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు ఎదుర్కోవడం తేలిక కాదని జగన్ కి బాగా తెలుసు. అందుకే ఈ ఉత్పాతాన్ని తట్టుకోడానికి ఏమి చేయాలా అని జగన్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు.

ఈ పరిస్థితుల్లో పాత పద్ధతులు పక్కనబెట్టి పార్టీకి, తనకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టే వారి కోసం జగన్ ఎదురు చూస్తున్నారట. అయితే ఆ వచ్చేది ఎవరో, ఏమిటో జగన్ కి కూడా క్లారిటీ లేదట. ప్రశాంత్ కిషోర్ పని తీరు, ఫలితం చూసాక ఇంకా ఆయన మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఉండటమే మేలని జగన్ డిసైడ్ అయిపోయారు. అయితే ఆ వాక్యూమ్ ఎవరు ఫిల్ చేస్తారు అన్నదానిపై జగన్ కి కూడా ఇంకా క్లారిటీ లేదు. అందుకే పార్టీ, ఎన్నికల పద్ధతుల మీద కొత్త కొత్త ఆలోచనల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ ఎదురు చూపులు ఫలించాలంటే జగన్ ని కదిలించే ఆలోచన కావాలి. మీ దగ్గర అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే జగన్ దగ్గర తలుపులు తెరిచే వున్నాయట.

మరిన్ని వార్తలు:

ఎవరి బలం పెరుగుతోంది..?

మూడో సర్వేలో మాడు పగిలే నిజాలు

జగన్ భార్యని ఆడిపోసుకుంటున్నారు.