లోకేష్ కి సైకాలజిస్ట్ అవసరం… జగన్ ఎప్పుడు నేర్చుకుంటాడో ?

nara lokesh says i have needs psychologist

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ కి సైకాలజిస్ట్ తో అవసరం పడింది. ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. ఈ విషయాన్ని వాళ్ళో వీళ్లో చెప్పలేదు. సాక్షాత్తు లోకేష్ స్వయంగా చెప్పారు. రాజధాని అమరావతి కేంద్రంగా జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో నాయకులకి వ్యక్తిత్వ విశ్లేషణ కూడా చేశారు. అందుకోసం కొన్ని పరీక్షలు పెట్టి ఆయా నాయకులకి వారిలో వున్న లోపాలు వివరించి వాటిని సరిదిద్దుకునే పాఠాలు కూడా చెప్పారు. దీన్ని ఏ నాయకుడైనా తప్పుగా తీసుకునే అవకాశం ఉందన్న అనుమానంతో లోకేష్ సైతం ఆ పరీక్ష ఎదుర్కోవడమే గాక స్వయంగా వేదికపై ఆ విషయాన్ని ప్రకటించారు. ఈ పరీక్ష వల్ల తనలో వున్న కొన్ని లోపాలు అర్ధం అయ్యాయని, వాటిని సరిదిద్దుకోడానికి సైకాలజిస్ట్ ని సంప్రదిస్తానని లోకేష్ చెప్పారు. ఓ రాజకీయ నాయకుడు , అందునా ఓ ముఖ్యమంత్రి కుమారుడు ఇలా ప్రకటించడం విశేషమే. సహజంగావారసత్వ రాజకీయాల ద్వారా ఎదిగిన వాళ్ళు ఇలాంటి అంశాలకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వరు. లోకేష్ వ్యవహారశైలి మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ తాజా ప్రకటనతో ఆయన తెలియని విషయాలు నేర్చుకోడానికి , తప్పులు సరిదిద్దుకోడానికి రెడీ గా వున్నారని అర్ధం అయ్యింది.

ఇక ప్రతిపక్ష నేత జగన్ కూడా లోకేష్ లాగానే ఓ రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. గెలుపు ఓటములు విషయం పక్కనబెడితే లోకేష్ కన్నా జగన్ చరిష్మా ఎక్కువ. కానీ జగన్ దుందుడుకు స్వభావం, నోటి దూకుడు ఆయనకు ఎన్నో ఇబ్బందులు తెచ్చి పెట్టింది. సాక్షాత్తు సీఎం అంతటివాడిని పట్టుకుని ఎన్నెన్ని మాటలు అన్నాడో అందరం చూసాం. దానికి ప్రతిఫలంగానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో జగన్ కి జనం గూబ గుయ్యిమనిపించారు. కానీ ఒక్క సారి కూడా తాను చేసింది తప్పు అని కాదు కదా పొరపాటు అనడానికి కూడా జగన్ సిద్ధంగా లేడు. ఓ వైపు శిక్ష అనుభవిస్తూ కూడా తనని తాను మార్చుకోవడం మాట అటుంచి కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేడు. ఈ పరిస్థితుల్లో విమర్శలు, వెటకారాలు తప్పవని తెలిసి కూడా లోకేష్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళతానని చెప్పడాన్ని జగన్ ఓ పాఠంగా తీసుకుంటే మేలు. లేదా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకుంటే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు.

మరిన్ని వార్తలు:

ఎవరో రావాలి, ఏదో చేయాలి… జగన్ ఎదురుచూపులు.

మోక్షు సినీ ఎంట్రీ పై బాలయ్య స్వీట్ న్యూస్.

ఎవరి బలం పెరుగుతోంది..?