సింధు ప్ర‌త్య‌ర్థి సోనూ సూద్

PV Sindhu And Actor Sonu Sood Played Badminton

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ పి.వి. సింధు… ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ స‌ర‌దాగా బ్యాడ్మింట‌న్ ఆడారు. ఈ వీడియోను సోనూసూద్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. మ‌న ప్ర‌త్య‌ర్థి ప్ర‌పంచంలోనే బెస్ట్ అయిన‌ప్పుడు ఓట‌మి గురించి భ‌య‌ప‌డ‌న‌క్క‌ర‌లేదని సోనూసూద్ ట్వీట్ చేశారు. మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేసినందుకు ధ‌న్య‌వాదాలు సింధు అని కూడా సోనూ సూద్ అన్నారు. సింధు జీవితం ఆధారంగా సోనూసూద్ బ‌యోపిక్ రూపొందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రూ క‌లిసి ఓ అకాడ‌మీలో ఇలా బ్యాడ్మింట‌న్ ఆడారు. బ‌యోపిక్ లో న‌టించే వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని సోనూసూద్ తెలిపారు. తెలుగ‌మ్మాయి సింధు ఒలంపిక్ లో ర‌జ‌త ప‌త‌కం సాదించ‌టం ద్వారా చ‌రిత్ర సృష్టించారు. ఇటీవ‌ల ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ లోనూ సింధు ర‌జ‌తం గెలిచారు. ఫైన‌ల్లో ఓడిపోయినా ఆమె ఆడిన తీరు క్రీడాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ ఆమెను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. బ్యాడ్మింట‌న్ లో విశేషంగా రాణించ‌టం ద్వారా సింధు ఎంద‌రికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. త‌న విజ‌యాల‌తో యువ‌త‌కు ఇప్పుడామె రోల్ మోడ‌ల్ గా మారారు. అందుకే సింధు జీవిత క‌థ‌ను సినిమాగా మ‌ల‌చాల‌ని సోనూసూద్ భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు:

పవన్‌ మళ్లీ తండ్రి కాబోతున్నాడు!

మహేష్‌, ఇలియానా కాంబో… క్లారిటీ వచ్చింది