ఒకే ఒక్కడు… భారత జర్నలిస్ట్ వాణి వినిపిస్తాడు.

I V Subbarao Attends To Journalist Conference In Kathmandu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జర్నలిజం… అది వృత్తి మాత్రమే కాదు ప్రవృత్తి కూడా. ఆ రంగంలో వున్న ఒక్కడి కంటికి కనిపించే దృశ్యం ఎన్నో కళ్ళకి మేలుకొలుపు. ఆ ఒక్కడు విన్న మాట ఎన్నో హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. అదే జర్నలిస్ట్ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత నిలబెట్టుకునే క్రమంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు వాళ్లకి ఎదురు నిలుస్తాయి. సమాజానికి దారి చూపే ఆ కళ్ళు సొంత విషయానికి వచ్చేసరికి ఎక్కడ , ఏ వైపు దీపం వెలుగుతుందా అని ఎదురు చూసే పరిస్థితి. ఈ సవాళ్ళని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల మీద జర్నలిస్ట్ సంఘాలు మేధోమధనం చేస్తూనే వున్నాయి. ఆ కోవలో అంతర్జాతీయ జర్నలిస్ట్ సమాఖ్య, దక్షిణ ఆసియా మీడియా సాలిడారిటీ నెట్ వర్క్ సంయుక్తంగా నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో జర్నలిస్ట్ సదస్సు నిర్వహిస్తున్నాయి.

ఈ నెల 8 , 9 , 10 తేదీల్లో జరిగే ఈ సదస్సులో మహిళా జర్నలిస్టులకి ఆన్ లైన్ ద్వారా వేధింపులు, దక్షిణ ఆసియాలో జర్నలిస్ట్ సమస్యలు, హక్కుల మీద చర్చించబోతున్నారు. ఈ సదస్సులో భారతదేశ జర్నలిస్ట్ వాణి వినిపించే అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ ఐ. వి. సుబ్బారావుకి దక్కింది. మొత్తం భారతదేశం తరపున ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఆయన ఒక్కరికే దక్కింది. భారతీయ జర్నలిస్ట్ వాణిని ఖాట్మండ్ వేదికపై వినిపించనున్న ఆయన తిరిగి 11 న వెనక్కి వస్తారు.

మరిన్ని వార్తలు:

వైసీపీ జెండా పీకేయబోతున్నారా ?

మలయాళి దోషితో బాలయ్య

21 కేజీల ల‌డ్డూ ధ‌ర రూ.15.60 లక్ష‌లు