‘రావణ’లో రానా హనుమంతుడు?

rana-wants-to-play-lord-hanuman-in-manchu-family

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మంచు ఫ్యామిలీ డ్రీమ్‌ చిత్రమైన ‘రావణ’ మరో రెండు మూడు సంవత్సరాల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రాఘవేంద్ర రావును ఇప్పటికే మోహన్‌బాబు ఒప్పించాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసి, భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌ మరియు విజువల్‌ వండర్‌గా సినిమాను రూపొందించాలని మంచు విష్ణు మరియు ఆయన తండ్రి మోహన్‌బాబు కలలు కంటున్నారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటి నుండే నటీనటులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ‘రావణ’ సినిమాలో రానా నటించేందుకు ఓకే చెప్పాడని మంచు ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 

ఛాలెంజింగ్‌ రోల్స్‌ను చేసేందుకు ఎప్పుడు ముందుండే రానా తాజాగా ‘రావణ’ చిత్రంలో హనుమంతుడి పాత్రను పోషించేందుకు ముందుకు వచ్చాడు. హనుమంతుడిగా తన నటన ప్రతిభను మరోసారి చూపించవచ్చనే ఉద్దేశ్యంతో రానా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘రావణ’ సినిమాలో రానా హనుమంతుడి పాత్ర పోషిస్తే సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం. తాజాగా ఈయన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఒక వైపు హీరోగా రానిస్తూనే మరో వైపు ఇలా విభిన్నతరహా పాత్రలకు ఓకే చెప్తున్నాడు. ఏ తెలుగు హీరో చేయని సాహస పాత్రలను రానా చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.

మరిన్ని వార్తలు:

మోక్షు సినీ ఎంట్రీ పై బాలయ్య స్వీట్ న్యూస్.

కొత్త భాష‌లు నేర్చుకుంటున్న ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ‌

అర్జున్ రెడ్డి 3 గంట‌ల 40 నిమిషాలు?