పవన్‌ బిగ్‌బాస్‌ చేస్తే..!

Shocking Comments Dhanraj On Jr Ntr And Pawan Kalyan Bigg Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇప్పటి వరకు ఏ తెలుగు రియాల్టీ షో దక్కించుకోని రికార్డు స్థాయి వ్యూవర్‌షిప్‌ను స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. అందుకు ప్రధాన కారణంగా బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్‌ హోస్ట్‌ అవ్వడం. వారం అంతా ఎలా సాగినా కూడా ఎన్టీఆర్‌ వచ్చే శని, ఆదివారాలు మాత్రం భారీగా ప్రేక్షకులు ఈ షోను ఆధరిస్తున్నారు. బిగ్‌బాస్‌ షోను ఎన్టీఆర్‌ ఒంటి చేత్తో లాక్కెలుతున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్‌ షో ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. అద్బుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

 ఇక బిగ్‌బాస్‌ షో నుండి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన ధన్‌రాజ్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ షోను ఎన్టీఆర్‌ కాకుండా పవన్‌ కళ్యాణ్‌ కూడా హోస్ట్‌ చేయగలడు అంటూ కామెంట్స్‌ చేశాడు. తెలుగులో స్టార్‌ హీరో అయిన పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో ఎలా నటించమన్నా కూడా సిద్దమే. కాని స్టేజ్‌పై అనర్గలంగా మాట్లాడటం మాత్రం కష్టం. ముఖ్యంగా సినిమాల గురించి, ఎంటర్‌టైన్‌మెంట్‌ గురించి పవన్‌ మాట్లాడలేడు. పవన్‌ రాజకీయాల గురించి మాట్లాడుతాడేమో కాని బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షో వేదికపై పవన్‌ ఎట్టి పరిస్థితుల్లో ఆకట్టుకోలేడు. ధన్‌రాజ్‌కు ఆ విషయం తెలియంది కాదు. కాని పవన్‌కు సోపు వేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని మెగా ఫ్యాన్స్‌ కూడా ధన్‌రాజ్‌ గురించి అంటున్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్ రెడ్డి 3 గంట‌ల 40 నిమిషాలు?

చైతూ, అల్లరిల్లో ఎవరిది పై చేయి?