యుద్ధం శరణం… ప్రివ్యూ

yuddham sharanam Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  నాగ చైతన్య , శ్రీకాంత్ , లావణ్య త్రిపాటి , రావు రమేష్ , రేవతి 
నిర్మాత :     సాయి కొర్రపాటి 
దర్శకత్వం :    కృష్ణ మరిముతు 
మ్యూజిక్ డైరెక్టర్ :  వివేక్ సాగర్ 
ఎడిటర్ :     క్రిపాకరన్ 
సినిమాటోగ్రఫీ : నికేత్  బొమ్మిరెడ్డి 

” యుద్ధం శరణం “. అనే టైటిల్ లోనే ఓ చిత్రం దాగి వుంది. యుద్ధం, హింస తగదన్న బుద్ధుడి ని మననం చేసుకునేందుకు ఉపయోగించే బుద్ధం శరణం గచ్చామి అన్న మాటల స్పూర్తితో ఈ టైటిల్ పెట్టారు. అయితే దానికి పూర్తి వ్యతిరేక అర్ధంలో యుద్ధం శరణం గా మార్చడం లో ఓ గమ్మత్తు వుంది. ఈ ఒక్కటి మాత్రమే కాదు. ఇంకో గమ్మత్తు కూడా వుంది. సినిమా హీరోలకు సక్సెస్, ఫెయిల్యూర్ కొత్త కాదు. ఆ రెంటితో సంబంధం లేకుండా మాస్ ఇమేజ్ సొంతం చేసుకోడానికి ప్రతి హీరో ప్రయత్నిస్తాడు. కొందరు అందులో సక్సెస్ అవుతారు. మరికొందరు కారు. కానీ మాస్ ఇమేజ్ అనే ఆశ వారిని కుదురుగా ఉండనివ్వదు. ఆ కోవలోకే వస్తాడు అక్కినేని నాగ చైతన్య.

మొదట్లో కాస్త తడబడే అడుగులతో మొదలైన అతని సినీ ప్రయాణం ఆ తర్వాత ఊపందుకుంది. ఓ విధంగా చెప్పాలంటే అతని కెరీర్ ఇప్పుడు కొత్త కొత్త కథలతో కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ ఇప్పటిదాకా మాస్ ఇమేజ్ కోసం అతను చేసిన ప్రయోగాలు పెద్దగా ఫలించలేదు. ఆ కొరత తీర్చుకోడానికి చైతు చేస్తున్న మరో ప్రయత్నం “యుద్ధం శరణం “. లవర్ బాయ్ గా సక్సెస్ చేస్తున్నప్పటికీ యాక్షన్ హీరో ఇమేజ్ కోసం చైతు చేస్తున్న ఈ ప్రయత్నానికి తన స్నేహితుడు కృష్ణ నే దర్శకుడు గా ఎంచుకున్నాడు. ఈ ఇద్దరికి ఎంతో సెలెక్టివ్ గా వుండే నిర్మాత సాయి కొర్రపాటి తోడయ్యాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న “యుద్ధం శరణం” మీద గట్టి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక వీటితో పాటు “యుద్ధం శరణం” మీద అంచనాలకి మరో కారణం ఇందులో విలన్ గా చేస్తున్న శ్రీకాంత్. ట్రైలర్ చూస్తుంటే యుద్ధం శరణం ఆసక్తి రేపుతోంది. ఈ ఆసక్తి, అంచనాలకు తగ్గట్టు యుద్ధం శరణం వుందో, లేదో రేపు తేలిపోనుంది.


మరిన్ని వార్తలు:

మేడ మీద అబ్బాయి… ప్రివ్యూ.

అవ‌న్నీ వ‌ట్టి పుకార్లే

ఈ విషయంలో స్పైడర్‌ అందరికి ఆదర్శం