ఈ విషయంలో స్పైడర్‌ అందరికి ఆదర్శం

Spyder Movie Won't Display Drunk And Smoking Adds Before Movie Start

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల ఏ సినిమా ప్రారంభంకు ముందు అయినా కూడా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వేస్తున్నారు. అంటే ఆ సినిమాలో మద్యపానం మరియు ధూమపానంను వినియోగించారు అని అర్థం. సినిమా మద్యలో కూడా ఏదైనా సీన్‌లో సిగరెట్‌ తాగడం లేదా మందు తాగడం వంటివి వస్తే ఖచ్చితంగా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వేయాల్సిందే. సెన్సార్‌ రూల్స్‌ ప్రకారం వాటిని వేయకుంటే నిర్మాతపై కేసు ఫైల్‌ చేయవచ్చు.

అయితే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రానికి అలాంటిది ఏమీ అవసరం లేదట.‘స్పైడర్‌’ చిత్రంలో మొదటి నుండి చివరి వరకు కూడా హీరో కాని, విలన్‌ కాని, ఇతర నటీనటులు కాని ఏ ఒక్కరు మద్యం తాగడం లేదా సిగరెట్‌ తాగుతూ కనిపించరని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అందుకే మా సినిమాకు సినిమాకు ముందు అలా వేయాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నారు. ఇటీవల ఏ సినిమాలో చూసినా కూడా బాటిల్స్‌కు బాటిల్స్‌ మందు తాగడం, సిగరెట్లు తాగడం చూపిస్తూ ఉన్నారు. కాని ఈ సినిమాలో అలా చూపించకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల అలాంటి సీన్స్‌ ఒక్కటి కూడా లేకుండా తెరకెక్కిన సినిమా అంటే ‘స్పైడర్‌’ ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఇతర స్టార్స్‌ అందరికి స్పైడర్‌ ఆదర్శం అవ్వాలని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

కుశ టీజర్‌ వచ్చేస్తోంది

అల్లరోడికి ఎంతటి దుస్థితి పట్టింది!