అవ‌న్నీ వ‌ట్టి పుకార్లే

love affair rumours on Hardik Pandya heroine Parineeti Chopra.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క్రికెట్ కూ, బాలీవుడ్ కూ లింక్ ఈనాటిది కాదు. మ‌న్సూర్ ఆలీఖాన్ ప‌టౌడీ, ష‌ర్మిలా ఠాగూర్ మొద‌లుకుని, విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ దాకా ఎంద‌రో క్రికెట‌ర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమ‌లో ప‌డ్డారు. వారి బాట‌లోనే ఇప్పుడు మ‌రో క్రికెట‌ర్, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ గురించి బాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. వారే యువ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా, హీరోయిన్ ప‌రిణీతి చోప్రా.  వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ పుకారు రావ‌టానికి  కార‌ణం ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన ఓ సంభాష‌ణ‌. కొన్ని రోజుల క్రితం ప‌రిణీతి చోప్రా ట్విట్ట‌ర్ లో ఓ సైకిల్ ఫొటో పోస్ట్ చేసింది.
ఆ ఫొటోకు క్యాప్ష‌న్ గా ఓ అద్భుతమైన పార్ట‌న‌ర్ తో ప‌ర్ ఫెక్ట్ ట్రిప్‌. ల‌వ్ ఈజ్ఇన్ ది ఎయిర్ అని ట్వీట్ చేసింది. దీనిపై పాండ్య ఓ కామెంట్ పెట్టాడు. ఆ పార్ట‌న‌ర్ ఎవ‌రో నేను ఊహించ‌నా..మ‌రో బాలీవుడ్, క్రికెట్ లింక్ అనుకుంట అని ట్వీట్ చేశాడు. దానికి ప‌రిణీత వెంట‌నే రియాక్ట‌యింది. ఆ పార్ట‌న‌ర్ మరెవ‌రో కాద‌ని, త‌న సైకిలే అని ట్వీట్ చేసి ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ సంభాష‌ణ చూసిన‌ నెటిజ‌న్లు  కొంద‌రు హార్దిక్ పాండ్యాపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారుకూడా.
అమ్మాయిపై కాదు…ముందు ఆట‌పై శ్ర‌ద్ద పెట్టు అని ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. అయితే ఈ సంభాష‌ణ త‌రువాత హార్దిక్ పాండ్య‌, ప‌రిణీతి చోప్రా డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. దీనిపై ప‌రిణీతి స్పందించారు. తాను సింగిలా కాదా అన్న చ‌ర్చ ఇప్పుడు అన‌వ‌స‌రం అన్న ప‌రిణీతి హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పుకార్ల‌ను  మాత్రం ఖండించారు. ఈ వార్త‌ల‌ను ఇంత‌కు ముందే విన్నాన‌న్న ఆమె అవ‌న్నీ అబ‌ద్ద‌మని తెలిపారు. త‌న స్నేహితులు సైతం త‌నను దీని గురించి అడ‌గ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని, త‌న జీవితంలో ఇవ‌న్నీ ఎప్పుడు  జ‌రిగాయా అన్న సందేహం వ‌స్తోంద‌ని ప‌రిణీతి వ్యాఖ్యానించారు. అటు హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్ప‌టిదాకా దీనిపై  స్పందించ‌లేదు.