ఎన్టీఆర్‌కు చెల్లెలు బ్రాహ్మణి అరుదైన గిఫ్ట్‌…!

Nara Brahmani surprising Gift To Jr NTR

బాలయ్య కూతురు బ్రాహ్మణి తాజాగా ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రాన్ని వీక్షించింది. ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తోంది. అంతేకాకుండా విజయదశమి సందర్భంగా అన్న ఎన్టీఆర్‌కు అరుదైన గిఫ్ట్‌ను అందించింది. ఎన్టీఆర్‌, బ్రాహ్మణిలు అన్నా చెల్లెల్లు. కానీ ఈ అన్నా చెల్లెల్ల గురించి వార్తలు రావడం చాలా అరుదు. దాంతో బ్రాహ్మణి ఎన్టీఆర్‌కు ఇచ్చిన బహుమతి ప్రస్తుతం మీడియాలో షికారు చేస్తోంది. దసరా కానుకగా బ్రాహ్మణి తన పెద్దనాన్న హరిక్రిష్ణ అరుదైన ఫొటోలు అన్నీ ఒక ఆల్బమ్‌గా తయారు చేయించి అన్న ఎన్టీఆర్‌కు ఇచ్చింది.

brahmani

హరిక్రిష్ణ అరుదైన ఫొటోలు చూసిన ఎన్టీఆర్‌ కంటతడి పెట్టారు. తనకు ఈ బహుమతి ఇచ్చిన బ్రాహ్మణికి థ్యాంక్స్‌ చెప్పాడు. తన తండ్రి తరుదైన ఫొటోలను చూసిన ఎన్టీఆర్‌ ఒక్కసారిగా చాలా ఎమోషనల్‌ అయ్యాడు. చెల్లెలు ఇచ్చిన బహుమతికి ఎన్టీఆర్‌ చాలా సంతోషపడ్డాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా బాలయ్య బాబు హాజరయ్యారు.

ntr