విద్యాబాలన్‌తో కన్నీరు పెట్టించిన నందమూరి ఫ్యామిలీ

Balakrishna family gives big Surprise to Vidhya Balan

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ కనిపించబోతుంది. గతంలోనే విద్యాబాలన్‌తో నటించాలని బాలకృష్ణ అనుకున్నాడు. కాని అది సాధ్యపడలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం విద్యాబాలన్‌ను సంప్రదించగా ఎక్కువ పారితోషికం చెప్పడంతో నిర్మాతలు వెనుకడుగు వేశారు. అయితే ఈసారి నిర్మాత బాలకృష్ణ అవ్వడం వల్ల ఎలాంటి ఆలోచన లేకుండా ఎంత పారితోషికం అయినా పర్వాలేదు అని చెప్పేసి క్రిష్‌ చేత విద్యాబాలన్‌ను ఎంపిక చేయించాడు. తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్న విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ చిత్రం సెట్స్‌లో అడుగు పెట్టింది.

షూటింగ్‌ గ్యాప్‌లో విద్యాబాలన్‌ తన వారితో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. విద్యాబాలన్‌ ఇంటికి వచ్చిన సమయంలో బాలకృష్ణ భార్య వసుందర పసుపు కుంకుమ ఇచ్చి, ఖరీదైన చీరను బహుమానంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు మరుపురాని బహుమానాలను కూడా బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ కుటుంబ సభ్యుల అభిమానంకు పొంగిపోయిన విద్యాబాలన్‌ ఆనందంతో కళ్లు చెమర్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే తేరుకుని కళ్లు తూడ్చుకుని కుటుంబంతో సరదాగా గడిపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విద్యాబాలన్‌కు నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద సన్మానం చేసి అందరిని ఆశ్చర్య పర్చారు.