బాలకృష్ణ కుటుంబానికి మరో ఎంపీ టికెట్ !

balakrishna second daughter husband to contest for visakhapatnam mp ticket

వచ్చే ఎన్నికల్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఏపీలోని అధికార తెలుగుదేశం దానికి ధీటైన అభ్యర్ధులని ఈ సారి బరిలోకి దింపాలని చూస్తున్నాయి. అందుకే రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో నిలబెట్టే అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటి నుండే తెలుగుదేశం దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ లు ఉన్న ఎంపీ లను  మినహాయించి క్రితమెన్నికల్లో ఓడిపోయినా, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చిన ఎంపీ స్థానాల్లో ఈసారి బలమయిన అభ్యర్ధులనే నుంచోబెట్టాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఓ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అదేమిటి అంటే ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ రెండో అల్లుడు ఎంపీగా పోటీ చేయబోతున్నాడట. బాలయ్య చిన్న కూతురు తేజస్విని భర్త శ్రీభరత్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడట.

బాలయ్య అల్లుడు శ్రీభరత్ గీతం అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనువడు. విశాఖ జిల్లాకు చెందిన ఆయన ఆ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. గతంలో ఈ పార్లమెంట్ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తుండడంతో విశాఖ పార్లమెంట్ స్థానంలో ఎవరిని దింపాలనే విషయంపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎంవీవీఎస్ మూర్తి విశాఖ టికెట్ ఆశించారు. దీనిని చంద్రబాబు విముఖత వ్యక్తం చేయడంతో ఆయన మనువడు, బాలయ్య అల్లుడు శ్రీభరత్ పేరు తెరపైకి వచ్చిందట. బాలయ్య కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో, విశాఖ టికెట్ శ్రీభరత్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే స్థానంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆసక్తి చూపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో బాలయ్య రెండో అల్లుడి రాజకీయ ఎంట్రీ కూడ ఫిక్స్ అయిపోయినట్టే.