నితిన్‌ బలి అవ్వడానికి ఇంత తొందర ఎందుకు?

Nithin to do movie with RX 100 Director Ajay Bhupathi

యంగ్‌ హీరో నితిన్‌ ఈమద్య నటించిన రెండు చిత్రాలు కూడా దారుణంగా ఫ్లాప్‌ అయ్యాయి. ప్రస్తుతం రెండు చిత్రాలను చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాల్లో ఒకటి ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. దిల్‌రాజు బ్యానర్‌లో సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస కళ్యాణం విడుదల కానున్న సమయంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘ఛలో’ చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల తన రెండవ సినిమాగా నితిన్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక నితిన్‌ తాజాగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడితో కూడా ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

కార్తికేయ, పాయల్‌ జంటగా తెరకెక్కిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం విజయంతో పలువురు యంగ్‌ హీరోలు ఈయనతో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇక ఇప్పటికే స్రవంతి రవికిషోర్‌ ఈయనతో ఒక చిత్రాన్ని చేసేందుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశాడు. రామ్‌తో ఆ చిత్రం చేస్తాడా లేదంటే కొత్త హీరోతో చేస్తాడా అనేది చూడాలి. ఇక నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి కూడా దర్శకుడు అజయ్‌ భూపతికి అడ్వాన్స్‌ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతుంది.

నితిన్‌తో అజయ్‌ మూవీ దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే దర్శకుడు అజయ్‌ భూపతి అడల్ట్‌ కంటెంట్‌ను ఆర్‌ఎక్స్‌ 100లో దట్టించి చూపించడం వల్ల సినిమా సక్సెస్‌ అయ్యింది. అంతే తప్ప ఆయన కొత్త కాన్సెప్ట్‌ ఏమీ కాదు, స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఏమీ లేదు. అయినా కూడా దర్శకుడిపై అంత నమ్మకం పనికి రాదు. ఒక వేళ నితిన్‌తో అలాంటి అడల్ట్‌ కంటెంట్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు. అందుకే నితిన్‌ తొందరపడి అజయ్‌ భూపతితో సినిమా చేస్తున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అజయ్‌ భూపతి ట్యాలెంట్‌ ఏంటీ అనేది ఆయన రెండవ సినిమాతో తెలిపోనుంది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఉదంతం గుర్తు చేసుకుని అజయ్‌ భూపతితో సినిమాను కమిట్‌ అవ్వాలంటే యువ హీరోలకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.