దిల్‌రాజు మాటలకు రాజ్‌ తరుణ్‌ సగం చచ్చాడు

Dil Raju insulted Raj Tarun in Lover movie promotion

రాజ్‌ తరుణ్‌ హీరోగా దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘లవర్‌’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ రాజ్‌ తరుణ్‌ గాలి తీయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. అందరికి తెలిసిన విషయమే అయినా కూడా ఆ విషయాన్ని అందరి ముందు, ఆ వ్యక్తి ముందు చెప్పడం వల్ల కొన్ని సార్లు బాధపడే అవకాశం ఉంటుంది. రాజ్‌ తరుణ్‌ నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మూడు నాలుగు సినిమాలు కూడా ఆడక పోవడంతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లే అని అంతా భావించారు. ఈ సమయంలోనే దిల్‌రాజు బ్యానర్‌లో లవర్‌ వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజ్‌ తరుణ్‌కు ఈ చిత్రం సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

రాజ్‌ తరుణ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు మాట్లాడుతూ… రాజ్‌ తరుణ్‌ నటించిన గత చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఈ చిత్రంను 8 కోట్ల బడ్జెట్‌తో ఆయనతో తీయడం అంటే సాహస నిర్ణయమే. కాని సంస్థ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. చాలా కాలంగా తనతో ఒక చిత్రాన్ని నిర్మించాల్సిందిగా రాజ్‌ తరుణ్‌ కోరుతున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో పాటకు ఒక సంగీత దర్శకుడిని పెట్టాలని దర్శకుడు చెప్పినప్పుడు రాజ్‌ తరుణ్‌కు అంత అవసరమా అని తాను అన్నాను. అయినా కూడా ఆయన పాటకో సంగీత దర్శకుడు అంటూ తీసుకు వచ్చాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు ఏ హీరోయిన్‌ కూడా ఆసక్తి చూపించలేదు. ఏదో తంటాలు పడాల్సి వచ్చిందంటూ దిల్‌రాజు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. లవర్‌ సినిమాను తన స్థాయిలో విడుదల చేయడం లేదని, అసలు లవర్‌ చిత్రాన్ని చేయడం దిల్‌రాజుకు ఇష్టం లేదన్నట్లుగా అంతా అనుకుంటున్నారు. తాజాగా దిల్‌రాజు వ్యాఖ్యలు ఆ విషయం నిజమే అనేలా ఉన్నాయి.