రవితేజ, చరణ్‌ ఇప్పుడు నారా రోహిత్‌

Nara Rohith to play mute guy in Upcoming Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ప్రయోగాత్మక చిత్రాల వైపుకు అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు హీరో అంటే హ్యాండ్సమ్‌గా ఉండటంతో పాటు, ఎటువంటి లోపం లేకుండా ఉండేవాడు. ఇతర భాషల్లో మాత్రం హీరోలు ఏదో ఒక లోపంతో అప్పుడప్పుడు కనిపించారు, కనిపిస్తూనే ఉన్నారు. తెలుగులో ఇన్నాళ్లకు హీరోలు ప్రయోగాత్మక చిత్రాల వైపుకు అడుగులు వేస్తున్నారు. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో గుడ్డివాడిగా కనిపించగా, రంగస్థలం చిత్రంలో రామ్‌ చరణ్‌ వినిపించని వ్యక్తిగా నటించాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఆ ఇద్దరు హీరోలకు మంచి పేరును తీసుకు వచ్చాయి. ఈ కారణంగానే ఇంకా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

రవితేజ మరియు రామ్‌ చరణ్‌ల తర్వాత అలాంటి ప్రయోగాత్మక ఛాలెంజింగ్‌ పాత్రలను చేసేందుకు నారా రోహిత్‌ సిద్దం అయ్యాడు. విభిన్న తరహా పాత్రలను చేసేందుకు మొదటి నుండి ముందుండే నారా రోహిత్‌ ఈసారి మూగ వాడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక యువ దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్‌ రోహిత్‌కు బాగా నచ్చడంతో వెంటనే అలాంటి పాత్రను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. కమర్షియల్‌ సినిమా అంటే హీరో భారీ మాస్‌ డైలాగ్స్‌ చెప్పడంతో పాటు, రొమాంటిక్‌ పాటు పాడాల్సి ఉంటుంది. కాని హీరో మూగవాడు అయితే సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అవుతాయి. అయినా కూడా నారా రోహిత్‌ ప్రయోగం చేయాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి బేషజాలకు పోకుండా ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఆసక్తి చూపించిన నారా రోహిత్‌ను అంతా కూడా అభినందించాల్సిందే.