నారా రోహిత్‌ వృదా ప్రయత్నాలు.. ఇంకా ఎన్ని చేస్తాడో?

filmmakers says Nara Rohit is going to make another balakrishnudu film a flop,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. నారా రోహిత్‌కు బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండటంతో సునాయాసంగానే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఈయన వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోవడంలో విఫలం అవుతున్నాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా కూడా నారా రోహిత్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆర్థికంగా కూడా ఉండటంతో సొంతగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసి, ఒకటి రెండు కూడా సక్సెస్‌ కాకపోయినా కూడా నారా రోహిత్‌ కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు. తాజాగా నారా రోహిత్‌ ‘బాలకృష్ణుడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది. మొదటి నుండి కూడా ఆ సినిమాలో నారా రోహిత్‌ కొత్తగా ఉంటాడు అంటూ ప్రచారం చేశారు.

ఫస్ట్‌లుక్‌లో చాలా విభిన్నంగా చూపించారు. అసు ఈయన నారా రోహిత్‌ కాదేమో అన్నట్లుగా ఆ ఫస్ట్‌లుక్‌ ఉంది. ఆ తర్వాత విడుదలైన పోస్టర్‌లు మరియు టీజర్‌లో చాలా సాదా సీదాగా నారా రోహిత్‌ కనిపించాడు. పైగా ఆ టీజర్‌లో సినిమా ఆకట్టుకోబోతుందనే అంశం ఏమీ లేదు. టీజర్‌తో సినిమా స్థాయిని పెంచడంలో చిత్ర యూనిట్‌ సభ్యులు విఫలం అయ్యారు. నారా రోహిత్‌కు ఈ సినిమా మరో ఫ్లాప్‌ అయ్యేలా ఉందని సినీ వర్గాల వారు బహిరంగంగానే అంటున్నారు. వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నా కూడా నారా రోహిత్‌ మాత్రం తన ప్రయత్నాలు మానడంలేదు. ఇంకా ఎన్ని ఫ్లాప్‌లు వస్తే అప్పుడు సినిమాల్లో హీరోగా నటించాలనే ఆలోచనను తుడిపేసుకుంటాడో అని ఆయనను విమర్శించే వారు అంటున్నారు.