‘ఆటగాళ్లు’ ప్రివ్యూ

Aatagallu Movie Previrew

నారా రోహిత్‌ హీరోగా దర్శన బానిక్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఆటగాళ్లు’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో జగపతిబాబు నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నారా రోహిత్‌ సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ చిత్రంలో మరో విభిన్నమైన పాత్రను నారా రోహిత్‌ పోషించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్‌ మరియు జగపతిబాఋ నువ్వా నేనా అన్నట్లుగా నటించారు అంటూ చిత్ర దర్శకుడు పరుచూరి మురళి చెప్పుకొచ్చాడు.

Aatagallu  Nara rohith Movie

జగపతిబాబు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన్నప్పటి నుండి కూడా పలు చిత్రాల్లో మంచి పాత్రలను దక్కించుకున్నాడు. అయితే ఈ చిత్రంలో చేసిన పాత్ర మాత్రం వాటికి చాలా విభిన్నంగా ఉంటుందని, తప్పకుండా నా నుండి ప్రేక్షకులు ఏదైతే కోరకుంటున్నారో అదే ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దర్శకుడు పరుచూరి మురళి కొన్నాళ్ల క్రితం జగపతిబాబుతో పెదబాబు చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మళ్లీ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక మంచి చిత్రంగా ఈ చిత్రం రూపొందినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం నారా రోహిత్‌కు కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. రేపు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటికి పోటీగా నిల్చుని ఈ చిత్రం కలెక్షన్స్‌ను రాబట్టగలదా అనేది రేపు చిత్రం విడుదలైన తర్వాత తేలిపోనుంది.