ఆటగాళ్ళు రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

Aatagallu-Movie-Review

నటీనటులు: నారారోహిత్,జగపతిబాబు,

దర్శకుడు:పరుచూరి మురళి

నిర్మాత:వాసిరెడ్డి

సినిమాటోగ్రఫీ:విజయ్.సి.కుమార్

సంగీతం:సాయికార్తీక్

నారా రోహిత్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆ సినిమా అంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా అది వైవిధ్యమైన సినిమా అందిస్తాడనే నమ్మకాన్ని తన గత చిత్రాలతో అందించాడు ఆయన, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, కాస్త వినూత్నంగా సినిమాలను అందించడంలో సిద్దహస్తుడిగా, తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడు. గతంలో రోహిత్ సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా ప్రేక్షకుల మనస్సులో హిట్ అయ్యాయి. అలాంటి నారా రోహిత్ లెజెండ్ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి తెలుగులో స్టైలిష్ విలనిజానికి ప్రాణం పోసిన జగపతి బాబుల కాంబినేషన్ లో ఆంధ్రుడు, పెదబాబు లాంటి హిట్ లు ఇచ్చిన పరచూరి మురళి దర్సకత్వంలో సినిమా వస్తోందంటే ఆ క్రేజే వేరు, అదీ కాక ముందు నుండి వైవిధ్యమైన సినిమా అంటూ ప్రచారం చేయడంతొ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి ఆ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.

కధ :

Nara-Rohit-Aatagallu-Movie

సిద్ధార్థ్ (నారా రోహిత్) టాలీవుడ్లో ఒక స్టార్ డైరెక్టర్, నాలుగైదు పెద్ద సినిమాలు హిట్ కొట్టిన ఆయన తన భార్య అంజలి(దర్శన బానిక్)ని చంపిన కేసులో అరెస్ట్ అవుతాడు. ఈ కేసులో పోలీసుల తరఫున వాదించడానికి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర(జగపతిబాబు)ని నియమిస్తుంది. అతడు సేకరించిన ఆధారాల ప్రకారం సిద్ధార్థ్ తన భార్యను హత్య చేశాడని తెలుసుకుంటాడు. దీంతో కోర్టులో సిద్దార్థ్ కి వ్యతిరేకంగా వాదిస్తాడు, అయితే న్యాయం త‌న ప‌క్క‌న ఉంద‌ని సిద్ధార్థ్ చెప్పిన విష‌యాలు విన్న వీరేంద్ర అనుమానంతో కేసును మళ్ళీ రీ ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని ఆధారాల‌ను సేక‌రించి త‌న‌కు అనుకూలంగే కేసు వాదించి నిర్ధోషిగా నిరూపిస్తాడు. అయితే తనను కేసు గెలిపించినందుకు లాయర్ వీరేంద్రకి బహుమతిగా కారు ఇస్తాడు సిద్దార్థ్. అయితే అది తనకు వద్దని దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చిన వీరేంద్రకి అసలు నిజం తెలుస్తుంది. అసలు నిజం ఏంటి ? సిద్ధార్థ్ భార్యని ఎవరు చంపారు ? వీరేంద్ర లాయ‌ర్‌గా న్యాయాన్ని గెలిపిస్తాడా? చివరికి తేలేది ఏంటి అనే విష‌యాలు తెలుసుకోవాలంటే పెద్ద తెర మీద సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

Aatagallu--Nara-rohith-Moviఆట‌గాళ్ళు సినిమా ఒక వ్యక్తి ఈగో వల్ల జరిగే అనర్ధాన్ని చూపించే సినిమా. మొత్తంగా ఒక నిజాయితీ కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ , ఈగో కోసం ఎంత దూరమైనా వెళ్ళే సెలబ్రిటీ స్టేటస్ తో ఈగో తలకేక్కికిన ఒక సినిమా డైరెక్టర్ మధ్య న‌డిచే ఆట. ఈ ఆటలో ఏ ఆటగాడు ఆట గెలిచాడు అనే విషయం తెరమీద చూడాల్సి వచ్చినా క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు.. ద‌ర్శ‌కుడి పాత్ర‌లో నారా రోహిత్ ..పాత్రల ప‌రంగా ఇద్ద‌రు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఎప్పటి లానే రోహిత్ లావుగానే ఉండి కాస్త ఇబ్బంది పెట్టినా నటన విషయంలో మెప్పించాడు. ఎప్పటిలానే జగపతిబాబు కూడా రెచ్చిపోయి నటించాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరక పోయినా దర్సనా బానిక్ చక్కని అభినయం ప్రదర్శించింది. కామెడీ ట్రాక్ అంటూ బ్రహ్మనందాన్ని తీసుకొచ్చి ఇరికించి కామెడీ మీద విరక్తి తెప్పించే ప్రయత్నం చేశారు. కొడుకును కాపాడుకోలేని క్యారెక్టర్ లో సీనియర్ ఆర్టిస్ట్ తుల‌సిమెప్పించింది. ఇక జబర్దస్త్ ఫణి , జీవా, సుబ్బ‌రాజు, నాగినీడు, చ‌ల‌ప‌తిరావు త‌దితరులు తమ తమ పరిధి మేరకు నటించారు.

Nara-Rohit's-Aatagallu-Movi

ఇక దర్శకుడు మురళి విషయానికి వస్తే భిన్నమైన సినిమా తీయాలనుకోవడం, కథాకథనాలు కొత్తగా ఉండాలని ఆలోచించడం బాగుంది నిజానికి ఈ మధ్య కాలంలో హిట్ కొట్టినవి కూడా అలంటి సినిమాలే, కానీ కొత్తగా మనం చెప్పే విషయాలు ప్రేక్షకులు అక్సేప్ట్ చేసేలా ఉండాలి. లాజిక్స్ లేకుండా కొత్తదనం కోసం ఇలాంటి కధలు రాసుకుని తెరకెక్కిస్తే ప్రేక్షకులు కూడా లాజిక్ లేకుండా సినిమాని అటకేక్కించేస్తారు. సినిమాలో మిస్సయిన అతి పెద్ద లాజిక్ కోమాలోకి వెళ్లిన పేషెంట్ ని రెండు నిమిషాల పాటు స్పృహలోకి తెచ్చి మళ్ళీ కోమా తెప్పించడమేంటో ? ఆ వైద్య శాస్త్రానికే అంతు చిక్కడం లేదు. కధనంలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేయడంలో మురళి ఈసరి ఫెయిల్ అయ్యాడు. పాటలు ఏమంత ఆకట్టుకోలేదు కానీ ఆర్ ఆర్ బాగుంది. విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణం బాగుంది. అయితే మొత్తానికి లైన్ గా చెప్పుకుంటే అదిరిపోయేలా ఉన్న సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిలయ్యాడు. తానొక సీనియర్ డైరెక్టర్ లా కాకుండా మొదటి సినిమాలా చేశానని చెప్పిన డైరెక్టర్ నిజంగానే కొత్తవాడిలా తీశాడు.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ఆటగాళ్ళు ఆట బాగా ఆడలేదు.

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.25 / 5