చంద్రబాబు పాత్రకే అయ్యి ఉంటాడు

Naveen Chandra plays Chandrababu role in NTR movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు వారి ఆత్మగౌరవంను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు మొదలు అయ్యాయి. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బాలయ్య ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి బాలకృష్ణ కూడా ఒక నిర్మాత అవ్వడం ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణతో పాటు ఈ చిత్రంలో మరో యువ హీరో నవీన్‌ చంద్రను కూడా ఎంపిక చేయడం జరిగిందని సమాచారం అందుతుంది. తేజ తాజాగా ఆయనతో చర్చలు జరిపాడని, త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చంద్రబాబు నాయుడును కీలకంగా చూపించాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇమేజ్‌ను పెంచే విధంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఉండాలని బాలయ్య కూడా భావిస్తున్నాడు. బావ వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు కీలక పాత్రను బాలయ్య ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు పాత్రకు రాజశేఖర్‌ను ఎంపిక చేయడం జరిగిందని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు పాత్రకు నవీన్‌ చంద్రను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్‌ చంద్రకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.