40 రోజుల సమ్మెకు ఫుల్‌స్టాప్‌

vishal puts cinema strike end

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కోలీవుడ్‌లో దాదాపు నెలన్నర రోజులుగా సాగుతున్న సమ్మె ముగిసింది. డిజిటల్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గించాలని మరియు పెద్ద బడ్జెట్‌ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే వీలు కల్పించాల్సిందిగా కోరుతూ 40 రోజులుగా తమిళ సినిమా పరిశ్రమ మొత్తం బంద్‌ను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు కోలీవుడ్‌లో మళ్లీ ఆటకు సిద్దం అయ్యింది. ఈనెల 20 నుండి కొత్త సినిమాల విడుదలకు సిద్దం కాబోతున్నాయి. గత నెలన్నర రోజులుగా పలు చిత్రాలు విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బంద్‌ ముగియడంతో ఆ సినిమాలన్ని మళ్లీ క్యూ కట్టబోతున్నాయి.

తమిళ సినిమా పరిశ్రమను డిజిటల్‌ ప్రొవైడర్లు పట్టి పీడిస్తున్నారు అంటూ బంద్‌ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. అయితే డిజిటల్‌ ప్రొవైడర్లు తాము అనుకున్నంత కంటే తగ్గేది లేదు అంటూ మొదటి నుండి కూడా భీష్మించుకు కూర్చున్నారు. బంద్‌ కొనసాగినా ఫలితం లేదని తేలడంతో నిర్మాతల మండలి చైర్మన్‌ అయిన విశాల్‌పై ఒత్తిడి మొదలైంది. బంద్‌ను ఎత్తివేయాల్సిందే అంటూ పలువురు విశాల్‌కు సూచించిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను వదిలేస్తున్నట్లుగా విశాల్‌ ప్రకటించాడు. వేసవి సీజన్‌లో తమిళంలో పలు పెద్ద సినిమాలు విడుదలై ఫుల్‌ కలెక్షన్స్‌ను తెచ్చుకుంటాయి. అందుకే వేసవిని వృదా చేయడం ఇష్టం లేక ఏదైతే అదే అయ్యిందని భావించిన కోలీవుడ్‌ వర్గాల వారు బంద్‌ను ముగించినట్లుగా ప్రకటించారు. దాదాపు 40 రోజులుగా మూతపడ్డ థియేటర్లు మళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోబోతున్నాయి.