ఎన్టీఆర్‌ సినిమాకు మరో ఘనత

Hero Vishal Going To Remake NTR Temper Movie In Tamil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్‌’ చిత్రం ఏ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు పలు అవార్డులు మరియు రివార్డులు కూడా వచ్చాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లో నిలిచి పోయే చిత్రం అయిన ‘టెంపర్‌’ ఇప్పటికే హిందీలో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. సినిమా కథ అద్బుతంగా ఉండటంతో తమిళంలో కూడా ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన విశాల్‌ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తాను అంటూ ప్రకటించాడు. ఇప్పటికే రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యింది. టెంపర్‌లో హీరోయిన్‌గా కాజల్‌ నటించిన విషయం తెల్సిందే. తమిళ రీమేక్‌లో విశాల్‌కు జోడీగా తెలుగులో పలు చిత్రాలు చేసి సక్సెస్‌ను దక్కించుకున్న రాశిఖన్నా నటించబోతుంది. తెలుగులో ఈమె ఇటీవలే ‘తొలిప్రేమ’ చిత్రంతో ఆకట్టుకుంది. తొలిప్రేమలో ఈమె నటనకు సినీ వర్గాల వారు మరియు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. తెలుగులో ఈమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాశిఖన్నాకు తమిళ టెంపర్‌లో నటించే అవకాశం దక్కింది. త్వరలోనే విశాల్‌, రాశిఖన్నాలపై కొన్ని టెస్ట్‌ షాట్స్‌ చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తెలుగు బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌గా నిలిచిన టెంపర్‌ తమిళంలో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.