ఈసారి విశాల్‌పై విరుచుకు పడ్డ శ్రీరెడ్డి

Sri Reddy faces threat from Vishal

గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌ ప్రముఖులపై విరుచుకు పడుతున్న శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌పై దాడి మొదలు పెట్టిన విషయం తెల్సిందే. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌తో పాటు హీరో శ్రీకాంత్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు రాఘవలారెన్స్‌పై తన విమర్శలను ఎక్కు పెట్టిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌లోని గోల్కోండా హోటల్‌లో తనతో లారెన్స్‌ అసభ్యంగా ప్రవర్తించాడు అని, అతడి మెడలో ఉన్న దండలు చూసి అతడిని మంచి వాడుగా భావించవద్దంటూ లారెన్స్‌ గురించిన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడుతున్నారు. తాజాగా ఈమె అల్లు అర్జున్‌ అన్నయ్య అల్లు బాబీపై కూడా వ్యాఖ్యలు చేసింది. అల్లు బాబీకి పబ్‌లలో గడపడం అంటే చాలా ఇష్టం అని, ఆయనతో కొన్నాళ్ల క్రితం ఎక్కువగా గడిపాను, కాని ఇప్పుడు మిస్‌ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

లారెన్స్‌ విషయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశాల్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన విశాల్‌ ఆశ్చర్యకరంగా శ్రీరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యాడు. ఇప్పుడు తన సినిమా పరిశ్రమకు చెందిన వారిపై వ్యాఖ్యలు చేస్తే విశాల్‌ ఎలా ఊరుకుంటాడు అంటూ అంతా కూడా అనుకుంటున్నారు. సినిమా పరిశ్రమకు మరియు తన వ్యక్తిగత సన్నిహితులకు ఎవరైనా హాని కలిగిస్తే మాత్రం విశాల్‌ తీవ్రంగా స్పందిస్తాడు. అలాగే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా విశాల్‌ గురించి ఆందోళన చెందుతుంది. తాను చేసిన వ్యాఖ్యలకు విశాల్‌ తనను హత్య చేసేందుకు కూడా వెనకాడడు అని, ఆయన నుండి తనకు ప్రమాదం పొంచి ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. విశాల్‌ ఆవేశపరుడు అని, ఆయన వల్ల తనకు ప్రమాదం ఉంటుందేమో అని శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.