పవన్ ని క్షమించడమే పెద్ద సవాల్….స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు !

renu desai comments on pawan kalyan

రేణు దేశాయ్ పవన్ మాజీ భార్యగానే కాక తనకంటూ ప్రత్యేక ఫ్లాట్ ఫాం ఏర్పరచుకోడానికి ఆమె ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. తన కోసం కాకపోయినా భవిష్యత్తులో తన పిల్లల అవసరాల కోసం అయినా ఒక తోడు ఉండాలని ఆమె మరో పెళ్ళికి సిద్దమయ్యింది. కానీ ఇది ఆమె వ్యక్తిగతం అని గ్రహించలేని అంత మెచ్యురిటీ కొంత మంది పవన్ ఫ్యాన్స్ వల్ల ఆమె కొన్ని సోషల్ మీడియా ఖాతాలను కూడా మూసేసింది. ఇది చూసి ఆమె కాస్త భయస్తురాలు అని భావించారు కొందరు. కానీ కాదు, ఈ విషయం ఆమెను దగ్గర నుండి చుసిన వారికి ఆమె గురించి తెలుసుకున్న వారికి అర్ధం అవుతుంది. ఆమె ఇటీవల ఒక అంతర్జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందించింది. ఒక పురుషుడు జీవితంలో ఎన్ని వివాహాలు చేసుకున్నా సమాజం వారిని నాయకులుగా, సెలబ్రిటీస్‌గా ఆమోదించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అదే పని ఒక మహిళ చేస్తే ఎందుకు ఆమోదించదంటారు? అని పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి అడిగిన ప్రశ్నకి ఆమె ఏమంటున్నారంటే దురదృష్టవశాత్తు, మనం ఇంకా పురుషాధిక్య సమాజం లోనే బతుకుతున్నాం. చాలా కొంత మంది పురుషులు మాత్రమే మహిళ కూడా ఒక మనిషే అని గుర్తిస్తారు. ప్రతి పురుషుడూ ‘స్త్రీ తన సొంతం’ అనుకుంటాడు.

ఒక మహిళ తన భర్తని పేరుతో పిలవడం ఒక పెద్ద తప్పు గా చూసే సమాజంలో ఉన్నాం మనం. ఒక మహిళ గౌరవాన్ని తన రెండు కాళ్ళ మధ్య దాచేశాం మనం. తనని ఒక ఆబ్జెక్ట్‌గా మాత్రమే చూస్తారు కానీ మనసున్న మనిషిగా కాదు. పురుషులు కూడా తామే మహిళల గౌరవాన్ని నిలబెట్టే ప్రతినిధులు అనుకుంటారు. చివరికి చేసేది ఏమి ఉండదు. మహిళలు శారీరకంగా కాస్త బలహీనులు కావచ్చు కానీ వ్యక్తులుగా సమాన హక్కులు కలిగి ఉంటారని, మహిళ కూడా ఒక మనిషేనని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. తల్లులు తమ కొడుకుల్ని సరిగ్గా పెంచితే సమాజం బాగుపడుతుంది. మహిళలే మహిళలకి శత్రువులు అన్నది చాలా నిజం. ఒక అత్తగారు తన అత్తగారితో కష్టాలు భరిస్తే, తన కోడలు కూడా అవే కష్టాలు పడాలని అనుకుంటుంది కానీ, కోడలు సుఖంగా ఉండాలని, తాను పడిన కష్టాలు తన కోడలు పడకూడదని అనుకోదు. ఈ ధోరణి మారాలి. రేపు పొద్దున్న ఒకవేళ నా కొడుకే తన గర్ల్ ఫ్రెండ్‌తో అనుచితంగా ప్రవర్తిస్తే, నేను ఆ అమ్మాయి వైపు నుంచి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కానీ నా కొడుకుని గుడ్డిగా సమర్థించను అని రేణు చెప్పుకొచ్చింది. అలాగే తన జీవితంలో అత్యంత క్లిష్టమైన క్షణం ఏమిటని అడిగితే ప్రతి రోజూ నాకు, జీవితానికి మధ్య జరిగిన యుద్ధం.

నా అనుకున్న దగ్గర మనుషులు నన్ను తీవ్రంగా బాధకి గురి చేసినా వారిని క్షమించడానికి నేను చేసిన ప్రయత్నమే అత్యంత కష్టమైన క్షణమని నా తల్లిదండ్రులు, నా భర్త ఇలా వీళ్లందరినీ క్షమించడానికి నేను చేసిన ప్రయత్నమే నాకు ఓ సవాలు అని నా తల్లిదండ్రులు కూడా అమ్మాయిగా పుట్టినందుకు ప్రేమగా చూడకపోవడం, నా భర్తకు భార్యగా రావడం ఇలా వీరిని క్షమించాల్సి రావడమే తనకు కష్టమైన క్షణం అని రేణు చెప్పుకొచ్చింది. ఇది అందరికీ బాధ కలిగించే విషయమే అయినా పవన్ అభిమానులు, లేదా అభిమానుల ముసుగు వేసుకున్న వారు ఎవరైనా ఉంటె దయ చేసి ఇంతటితో ఆపేయడం చాలా మంచిది. లేదంటే రాజకీయంగా ఇప్పుడే ఎదగడం ప్రారంభించిన పవన్ కి గానీ…కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రేణుకి గానీ మంచిది కాదు. పాత గాయాల్ని రేపుకోవడం తప్ప.

Courtesy : BBC Telugu