వెబ్‌ సిరీస్‌లకు సెన్సార్‌ సాధ్యమా?

sensor scissors coming soon on The web series

కొన్నాళ్ల క్రితం వరకు సినిమాలకు మాత్రమే సెన్సార్‌ ఉండేది. సినిమాల్లో ఏమైనా అభ్యంతరకర సీన్స్‌ ఉన్నా లేదంటే సినిమాల్లో అశ్లీలం ఎక్కువ ఉన్నా కూడా సెన్సార్‌ బోర్డు కొరడా జులిపించడం జరుగుతుంది. ఈమద్య బుల్లి తెర అదే టీవీల్లో కూడా అతిగా అశ్లీలంతో పాటు యాక్షన్‌ ఎక్కువగా ఉంటున్న కారణంగా టీవీ షోలకు కూడా సెన్సార్‌ కార్యక్రమం పెట్టారు. బుల్లి తెరకు సెన్సార్‌ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అశ్లీల కంటెంట్‌ను వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించారు. వెబ్‌సిరీస్‌లో ఎలాంటి కంటెంట్‌ అయినా చూపించేస్తున్నారు. దాంతో ఇండియన్‌ ప్రభుత్వం వెబ్‌ సిరీస్‌లకు కూడా సెన్సార్‌ ఉండాలని నిర్ణయానికి వచ్చారు.

సెన్సార్‌ బోర్డు వారి నుండి క్లీయరెన్స్‌ వచ్చిన వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే ఇకపై ప్రసారంకు అనుమతించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన సాధ్యా అసాద్యాలను పరిశీలిస్తున్నారు. వెబ్‌ సిరీస్‌లకు సెన్సార్‌ సాధ్యం అవ్వదని కొందరు అంటున్నారు. సెన్సార్‌ బోర్డులు ఎంతగా కఠినంగా వ్యవహరించినా కూడా వెబ్‌సైట్స్‌లో ఉండే అశ్లీల కంటెంట్‌ను మరియు యాక్షన్‌ సీన్స్‌ను పెట్టేయొచ్చు. కాని సెన్సార్‌ బోర్డు వారు ఎలా ఈ వెబ్‌సైట్స్‌లో అదుపులోకి పెడతారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెబ్‌ సిరీస్‌లకు సెన్సార్‌ సాద్యమే అని, కాకుంటే ఎక్కువగా గ్రౌండ్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల జోరు కొనసాగుతున్న ఈ సమయంలో సెన్సార్‌ పరిధిలోకి రావడం అనేది కాస్త సోచనీయమే.