విశాల్ నామినేషన్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ ట్విస్ట్…

Vishal RK Nagar By elections Nomination Climax Twist

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆదిలోనే క్లైమాక్స్ కనిపించించింది. ఆర్కే నగర్ ఎన్నికల గోదాలోకి దిగుదాం అనుకున్న విశాల్ కి. విశాల్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేల్చారు. ఈ వ్యవహారంలో సినిమా క్లైమాక్స్ ని మించిన ట్విస్ట్ లు వున్నాయి. విశాల్ ని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన 10 మంది ఓటర్లలో సుమతి, దీపన్ అనే ఇద్దరు ప్లేట్ ఫిరాయించారు. ఆ సంతకాలు తమవి కావని చెప్పడంతో విశాల్ నామినేషన్ చెల్లకుండా పోయింది. రిటర్నింగ్ అధికారి ఈ విషయం ప్రకటించగానే విశాల్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాడు. నేరుగా వెళ్లి రిటర్నింగ్ అధికారిని కలిసాడు. అక్కడ నుంచే ఆ ఇద్దరూ మాట మార్చిన ఇద్దరి బంధువులకు ఫోన్ చేశారు. వాళ్ళు అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ అనుచరుల బెదిరింపుల వల్లే మాట మార్చినట్టు చెప్పడంతో నామినేషన్ ని ఓకే చేస్తున్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు. ఆ తరువాతే అసలు ట్విస్ట్. విశాల్ నామినేషన్ మీద సంతకాలు చేసిన ఆ ఇద్దరూ నేరుగా రిటర్నింగ్ అధికారిని కలిసి అవి తమ సంతకాలు కాదని చెప్పడంతో సీన్ మారిపోయింది. రాత్రి అయ్యాక విశాల్ నామినేషన్ చెల్లదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Vishal-Nomination rejected

నో …ఎస్ …నో …. నిజానికి ఏ సినిమాలో అయినా ఇలాంటి సన్నివేశం ఉంటే అబ్బో అతి అనుకోవచ్చు. కానీ కళ్ల ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. విశాల్ పోటీ చేస్తే గెలుస్తాడా, లేదా అన్నది వేరు. ఒకవేళ గెలిచినా ఆయన ఆర్కే నగర్ కోసం ఏమైనా చేస్తాడా అన్నది వేరు. కానీ నాటకీయంగా ఆయన్ని పోటీలో లేకుండా తప్పించిన విధానం మాత్రం దారుణం. ఇంతకుముందు కూడా ఆర్కే నగర్ లో వున్న తెలుగు ఓటర్లని ఆకట్టుకునేందుకు తెలుగు మూలాలున్న మధుసూదన్ కి విశాల్ ద్వారా ఇబ్బందులు వుంటాయని తెలుగు బులెట్ అంచనా వేసింది. ఆ ఆలోచన తోటే విశాల్ ని శశి వర్గం సీన్ లోకి తెచ్చిందన్న వాదన వినిపించింది. కానీ ఆ నిజాలు లోకానికి తెలిసే లోపే విశాల్ ని ఎన్నికల బరి నుంచి తప్పించడానికి అధికార అన్నాడీఎంకే బరితెగించింది. ఇప్పటికిప్పుడు ఏమి కాకపోయినా ప్రమాదకర భవిష్యత్ కి ఇలాంటి సంఘటనలే బలమైన సంకేతాలు.