ప్రముఖ నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూత..!

Famous actress Meera Jasmine's father passes away
Famous actress Meera Jasmine's father passes away

టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటు ఉన్నారు . ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ తుదిశ్వాస విడిచినట్లు అర్ధం అవుతుంది . మీరా జాస్మిన్ తల్లిపేరు ఎలియమ్మ జోసెఫ్. వీరికి నలుగురు పిల్లలు. జోసెఫ్ ఫిలిప్‌ కు మీరా చిన్న కుమార్తె. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, జాయ్. మీరా జాస్మిన 2001లో లోహితదాస్ దర్శకత్వం వహించిన సూత్రధారన్ మూవీ తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాష లో అనేక మూవీ ల్లో నటించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్, తమిళంలో విశాల్ జోడిగా పందెం కోడి మూవీ లు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.