నిద్రపోతున్న అధికారాన్ని కదిలించిన విశాల్ డైలాగ్స్!

నిద్రపోతున్న అధికారాన్ని కదిలించిన విశాల్ డైలాగ్స్!
National , Latest News

Cyclone Michaung : ప్రస్తుతం వర్షాలతో అతలాకుతలం అవుతుంది . రోడ్డుపై కార్లు సైతం కొట్టుకుపోతోన్నాయి. ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. కనీసం నిత్యావసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో చెన్నై నగరవాసులు ఉన్నారు .

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సినీ సెలెబ్రిటీలు, హీరోలు అంత సాహసం ఎవరు చేయరు. మనకెందుకులే అని చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. కానీ విశాల్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుంటాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. తాజాగా విశాల్ చెన్నై వరదల మీద, తీసుకుంటున్న చర్యల మీద ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. అధికారుల పరువు తీసేసాడు . ఈ మేరకు విశాల్ షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

నిద్రపోతున్న అధికారాన్ని కదిలించిన విశాల్ డైలాగ్స్!
Vishal

‘చెన్నై మేయర్ ప్రియా రాజన్ గారు, గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్, ఇతర అధికారులు.. మీరంతా క్షేమంగా మీ ఫ్యామిలీతో నే కలిసి హాయిగా ఉన్నారా? మీ ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు రాలేదు కదా? నిత్యావసర సరుకులు మీ ఇంటికే వస్తున్నాయ్ కదా?.. కానీ మీరు ఒక సాధారణ ఓటరు, సాధారణ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? మీరున్న ఈ సిటీలో వారు ఎలా కష్టాలు పడుతున్నారో చూస్తూ ఉన్నారా..?

మీరున్న ఈ సిటీలోనే మేం ఉన్నాం.. కానీ మీలాంటి స్థితిలో మేం లేము.. తుపాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నై కోసమా? సింగపూర్ కోసమా?.. 2015లో మేం అంతా ముందుకు వచ్చి సాయం చేశాం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేం సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాము .. ఎనిమిదేళ్ల తరువాత కూడా అలాంటి పరిస్థితే.. అంతకు మించి దారుణ పరిస్థితులు కూడా ఎదురయ్యాయి..

 

Video : https://twitter.com/VishalKOfficial/status/1731689508238713069?s=20