తెలుగుంటి అమ్మయితోనే !

Hero Vishal decides to marry a Telugu Girl

తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ లాగే తమిళ ఇండస్ట్రీలో విశాల్ పెళ్లి గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. వయస్సు  మీద పడుతున్నా అతను మాత్రం పెళ్లి వైపు అడుగులు వేయట్లేదు. ఆయన ఎవరో కాదండీ మన తెలుగు మూలాలు ఉన్న విశాల్ సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన వరలక్ష్మితో విశాల్‌ ప్రేమాయణం నడుపుతున్నాడని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో వార్తలు వచ్చేవి. దానికి తగ్గట్టుగానే కొన్ని సందర్బాల్లో ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లే కనిపించారు. ఇక పెళ్లే తరువాయి అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఆద్మీ లేదని తేల్చి పారేశాడు. అయితే తాజాగా 40 ఏళ్లు ఉన్న విశాల్ ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో వైరల్ అయ్యింది. చైన్నైలో పుట్టి పెరిగిన విశాల్ స్వస్థలం చిత్తూరు జిల్లానే. వాళ్ల నాన్న – తాతలు తెలుగువారే. తాజాగా విశాఖపట్నంలో అభిమన్యుడు ప్రొమోషన్స లో భాగంగా పర్యటించిన విశాల్ ను పెళ్లిపై ప్రశ్నించింది తెలుగు మీడియా. అయితే కాలమే నా పెళ్లి చేయాలని వేదాంతం చెప్పి తప్పించుకున్నాడు విశాల్. అభిమన్యుడు తెలుగులో హిట్ కొట్టిన విశాల్ ఇప్పుడు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఎంత వరకూ నిజమో చూడాలి మరి..