జగన్ పార్టీకి సినీ గ్లామర్… జగన్ వెంట ఆ హీరో కూడా !

Cine actors support Jagan for Praja Sankalpa Yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైసీపీ కూడా సినీ గ్లామర్ మీద కన్నేసినట్టే కనపడుతోంది. అందుకే పార్టీకి సినీ గ్లామర్ అద్దె ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీ పాదయాత్రలో జగన్ ని కలిశారు. ఆయన వెంట ఉంటానని చెప్పారు. అప్పటి నుండి అదే పనిలా పెట్టుకుని చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే టికెట్ తో పని లేదని, వైఎస్ జగన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరం అని అన్నారు. ఆ వెంటనే మరో సినీ నటుడు థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పాపులర్ అయిన ప్రుథ్వీరాజ్ కూడా అడుగు కలిపారు. జగన్ తో కలిసి పశ్చిమ గోదావరిలోనే పాదయాత్రలో పాల్గొన్నారు. వారికి తోడుగా ఇటీవలే ఇంద్ర వంటి సినిమాలకి మాటల రచయితగా చేసిన చిన్ని కృష్ణ సైతం జగన్ ని కొనియాడుతూ కామెంట్స్ చేశారు.

ఇలా వరుసగా ఒక్కొక్కరుగా టాలీవుడ్ ప్రముఖులు జగన్ పాత పాడటం ఇప్పుడు ఆసక్తి గా మారింది. వారికి తోడుగా మరికొందరు కూడా ప్రజా సంకల్పంలో అడుగులు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జి ఆదిశేషగిరి రావు ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నారని, కొందరు కీలక సినీ ప్రముఖులు జగన్ కి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. వారిలో ఓ సినీ హీరో ఉన్నాడని చెబుతున్నారు. నిన్న బుర్రిపాలెంలో ఆయన చంద్రబాబు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి మహేష్ కి పార్టీకి ఏమీ సంబందంలేదని చెప్పడంతో ఆ హీరో మహేష్ కాదని అనుకుంటున్నారు.

అయితే సహజంగా టాలీవుడ్ నుండి మరెవరూ జగన్ వెంట నడవకుండా టీడీపీ పెద్దలు కొందరు ఒత్తిడి పెంచుతున్నారేమో అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు నేటివిటీ కలిగుండి తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న హీరోల్లో విశాల్ ఒకరు. విశాల్ సినిమాలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విడుదలయ్యి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు విశాల్ ని జగన్ వెంట నడిచేలా జగన్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విశాల్ వైకాపా తరపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ అని విశాల్ ను అడిగితే… జగన్ తనకు ఎప్పటి నుంచో తెలుసునని… జగన్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నట్టు తెలిపారు. ప్రచారం చేయమని అడిగితే అప్పుడు ఆలోచిస్తా అన్నారు కానీ వైకాపా తరపున ప్రచారం విషయాన్నీ విశాల్ కొట్టి పారెయ్యడం లేదు. దీంతో ఈ వాదనకి మరింత బలం చేకూరుతోంది.