సీఎం బాబుగా జోగేంద్ర బాబు!

Rana to play Chandrababu Naidu in NTR biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అనే విషయం తెల్సిందే. తన తండ్రి పాత్రను పోషించేందుకు బాలయ్య చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మొదట ఈ చిత్రానికి తేజ దర్శకత్వం అనుకున్నారు. కాని ఆయన తప్పుకోవడంతో క్రిష్‌ వచ్చి చేరాడు. దాంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఈ సమయంలోనే బాలయ్యకు సగం పని తగ్గిందని, అన్ని విషయాలను కూడా క్రిష్‌ చూసుకుంటాడు అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక నటీనటుల ఎంపిక విషయంలో క్రిష్‌కు పూర్తి స్వేచ్చను బాలకృష్ణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట అనుకున్న వారు కాకుండా క్రిష్‌ తనకు తగ్గ వారిని, తాను అనుకున్న వారిని ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

తేజ దర్శకత్వంలో సినిమా అన్నప్పుడు కళ్యాణ్‌ రామ్‌తో పాటు కొందరు నటీనటులను ఎంపిక చేయడం జరిగింది. కాని వారి స్థానంలో ప్రస్తుతం ఇతరులను ఎంపిక చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు పాత్ర ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో కీలకంగా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంను ఆరంభించిన సమయంలో చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించాడు. అందుకే ఆ పాత్రకు ప్రముఖ నటుడిని ఎంపిక చేయాలని భావించాడు. అందుకే తనకు మంచి పరిచయం ఉన్న హీరో రానాను ఈ పాత్ర కోసం ఒప్పించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా అయితేనే బాగుంటుందని క్రిష్‌ భావిస్తున్నాడు. ఇప్పటికే రానా నుండి 30 రోజుల డేట్లను కూడా క్రిష్‌ తీసుకున్నాడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో కొత్త నటీనటులు చాలా మంది కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.