బన్నీ హ్యాట్రిక్‌కు సిద్దం

Allu Arjun Wants To Work With Trivikram and Surender Reddy vikram K kumar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ వరుసగా సక్సెస్‌లు దక్కించుకుని జోరుగా కెరీర్‌లో దూసుకు పోతున్న సమయంలో అనుకోని అవాంతరం అన్నట్లుగా ‘నా పేరు సూర్య’ చిత్రం ఫెయిల్‌ అయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్‌ మరియు నాగబాబులు సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రం బన్నీకి తీవ్రంగా నిరాశ కలిగించింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించి మెప్పించలేక పోయాడు. ఆ సినిమా ఫెయిల్‌ అవ్వడంతో కాస్త అల్లు అర్జున్‌ తన తర్వాత సినిమాకు ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య చిత్రం సమయంలోనే బన్నీ తర్వాత సినిమాను విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు కాస్త గ్యాప్‌ తీసుకుంటున్న నేపథ్యంలో ఈయన మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా అల్లు అర్జున్‌ సినిమాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మరో నెల రోజుల్లో విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మూవీకి అల్లు అర్జున్‌ సిద్దం అవుతున్నాడు. ఇదే సంవత్సరంలో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేయబోతున్నారు. విక్రమ్‌ కుమార్‌ విభిన్న కథాంశంను బన్నీ కోసం సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ‘మనం’, ‘24’, ‘హలో’ వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ బన్నీకి చాలా ప్రత్యేకమైన కథను రెడీ చేశాడట. విక్రమ్‌ కుమార్‌ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రం పూర్తి అయిన వెంటనే అంటే ఈ సంవత్సరం నవంబర్‌ లేదా డిసెంబర్‌లో బన్నీతో త్రివిక్రమ్‌ మూవీ ప్రారంభం కాబోతుంది. ఇక త్రివిక్రమ్‌ మూవీ పూర్తి అయిన తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో బన్నీ చేయబోతున్నాడు. సైరా చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం బన్నీతో సురేందర్‌ రెడ్డి సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి ముగ్గురు స్టార్‌ దర్శకులను పట్టుకున్న బన్నీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.