పెళ్లి కూతురు కాబోతున్న నయనతార

పెళ్లి కూతురు కాబోతున్న నయనతార

ఇద్దరు ప్రియులతో విడిపోయి, సినిమాలపై దృష్టి సారిస్తున్న తరుణంలో నయనతార జీవితంలోకి యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ ఎంటర్ అయ్యాడు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల క్రితం ఈ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ జంట గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.

నయనతార – విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరూ బహిరంగంగానే ఒప్పుకున్నారు. అప్పటి నుంచి హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. దీంతో ఈ జంటపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విఘ్నేష్‌తో నయన్ పెళ్లి గురించి కూడా జోరుగా ప్రచారం జరిగింది.

కొన్నేళ్లుగా నయనతార తన ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శిస్తోంది. తమ బంధం బలంగా ఉండాలన్న కోరికతోనే వాళ్లిద్దరూ తరచూ ఆలయాలకు వెళ్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందని ఓ న్యూస్ లీక్ అయింది.

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లికి సిద్దమైందనేదే ఆ న్యూస్ సారాంశం. విఘ్నేష్ కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా పెళ్లి గురించి అతడిపై ఒత్తిడి తెస్తున్నారట. ఈ విషయాన్ని నయన్‌కు చెప్పడంతో ఆమె బలవంతంగా ఒప్పుకుందని తమిళ ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నయన్ పెళ్లి కూతురు కాబోతుందని ప్రచారం మొదలైంది.