మిజోరంలో కొత్త సర్కార్.. సీఎంగా లాల్‌దుహోమా ప్రమాణస్వీకారం..!

New government in Mizoram.. Lalduhoma sworn in as CM..!
New government in Mizoram.. Lalduhoma sworn in as CM..!

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈరోజు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌- ZPM’ పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్​ డా.కంభంపాటి హరిబాబు అయిజోల్​లోని రాజ్​భవన్​ కాంప్లెక్స్​లో లాల్​తో ప్రమాణం స్వీకారం చేయించారు. లాల్‌దుహోమాతో పాటు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఇతర జెడ్​పీఎం నేతలు కొందరితో మంత్రులుగా ప్రమాణం చేశారు​. మరోవైపు జెడ్​పీఎం పార్టీ నాయకుడిగా లాల్‌ దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను పార్టీ నేతలు ఎన్నుకున్నారు. 2018 ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న జెడ్​పీఎం ఈసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాలను కైవసం చేసుకుంది.

8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరంలో నవంబర్​ 7న పోలింగ్​ నిర్వహించగా.. ఇందులో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, జెడ్‌పీఎం, ఎంఎన్‌ఎఫ్‌ 40 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. తొలిసారి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో అభ్యర్థులను దింపగా.. ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.