దుమ్ములేపేందుకు రెడీ అయిన దేవీ శ్రీ ప్రసాద్

దుమ్ములేపేందుకు రెడీ అయిన దేవీ శ్రీ ప్రసాద్

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా పుష్ప అప్డేట్ రాబోతోందనే రూమర్లు నిజమయ్యాయి. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఐదు భాషల్లో రాబోతోన్న ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. హిందీ, తమిళ, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ఈ పాటను ఆగస్ట్ 13న విడుదల చేయబోతన్నట్టు తెలిపారు. పుష్ప ఫస్ట్ సింగిల్ అంటూ దాక్కో దాక్కో మేక.. అంటూ దుమ్ములేపేందుకు దేవీ శ్రీ ప్రసాద్ రెడీ అయ్యారు.

నేటి ఉదయం నుంచి దేవీ శ్రీ ప్రసాద్ బర్త్ డేతో పాటుగా పుష్ప ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూనే వచ్చింది. అలా ఈ రోజు కచ్చితంగా పుష్ప పాటల గురించి అప్డేట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. ఉదయం నుంచి పుష్ప, తగ్గ్యేదేలా, అల్లు అర్జున్ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూనే వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. విశాల్ దద్లానీ హిందీలో, తెలుగులో శివం, తమిళంలో బెన్నీ, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించున్నారు. దాక్కో దాక్కో మేక అంటూ ఈ పాట ఆగస్ట్ 13న రాబోతోంది.