“క్లీన్” అని క్యాప్షన్ ఇచ్చిన నిధి అగర్వాల్

టాలీవుడ్ లో న్యూ జెనరేషన్ భామల్లో నిధి అగర్వాల్ ఒకరు.  ‘సవ్యసాచి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ ‘Mr.మజ్ను’.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాల్లో నటించింది.  మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా ‘ఇస్మార్ట్ శంకర్’ తో నిధి ఖాతాలో ఒక సూపర్ హిట్ చేరింది. దీంతో హీరోయిన్ గా డిమాండ్ అయితే పెరిగింది.  ఈ సంగతి పక్కన పెడితే నిధి సోషల్ మీడియాలో మంటలు పెట్టే కార్యక్రమంలో కూడా బిజీగానే ఉంది.

నిధి ఇన్స్టా ఖాతా కు నాలుగు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడంతో పాటుగా హాటుఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా మరో సారి రెండు ఫోటోలను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు “క్లీన్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఏ ఉద్దేశంతో క్లీన్ అని క్యాప్షన్ ఇచ్చిందో కానీ ఫోటోలో మాత్రం క్లీవేజ్ షో చేసింది. డీప్ వీ నెక్ ఉండే వైట్ టాప్ ధరించడంతో అందాల నిధులు బయటపడ్డాయి. మెడలో ఒక గోల్డ్ చెయిన్.. చేతికి ఉంగరం.. చెవులకు గాజులలాంటి కమ్మలు ధరించి మినిమమ్ మేకప్ తో ఫోటోలకు పోజిచ్చింది. ఒక ఫోటోలో ఓరచూపు చూస్తూ మరో ఫోటోలో అలా పక్కకు చూస్తూ గ్లామరస్ గా కనిపించింది.

ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “న్యాచురల్ బ్యూటీ”.. “క్యూట్ లిప్స్”.. “క్లీన్ బౌల్డ్” అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ లో ‘మాస్క్’.. ‘ఇక్కా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.  ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చెయ్యలేదు.