దొర‌సాని నుండి నింగిలోన పాల‌పుంత‌.. వీడియో సాంగ్‌

ningiloni paalapuntha video song from dorasani

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్, రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కించిన చిత్రం దొర‌సాని . నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం జూలై 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్రానికి సంబంధించి ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ మూవీపై ఆస‌క్తి పెంచుతున్నారు. తాజాగా నింగిలోన పాల‌పుంత‌.. అంటూ సాగే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించ‌గా, గోరెటి వెంక‌న‌క్న లిరిక్స్ అందించారు. ఈ పాట శ్రోత‌ల‌ని అల‌రిస్తుంది.

దొర‌సాని చిత్ర ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రాజుగా ఆనంద్ , దొర‌సానిగా శివాత్మిక ఎంతో మెచ్యూర్డ్‌గా న‌టించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్‌, శివాత్మికకి ఈ చిత్రం మంచి స‌క్సెస్‌ని ఇస్తుంద‌ని టీం అంటుంది