హాలీవుడ్ చిత్రంలో తొలి త‌మిళ న‌టుడు

first tamil actor in hollywood

ప్ర‌ముఖ న‌టుడు నెపోలియ‌న్ ద‌క్షిణాది భాష‌ల‌లో వంద‌కి పైగా సినిమాలు చేశారు. ఆయ‌న తొలిసారి హాలీవుడ్‌లో న‌టించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు. ర‌జనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌కి శాలువా క‌ప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు నెపోలియ‌న్. ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ ఎజామాన్ చిత్రంలో విల‌న్ పాత్ర పోషించారు నెపోలియ‌న్.

డెవిల్స్ నైట్‌, క్రిస్ట‌మ‌స్ కూప‌న్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం నెపోలియ‌న్‌కి ద‌క్కింద‌ని తెలుస్తుంది. క్రిస్ట‌మ‌స్ కూప‌న్ చిత్రం డానియ‌ల్ నుడ్సెన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా ఇందులో కోర్ట్నే మాథ్యూస్‌, ఆరోన్ నోబుల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో హాకీ ప్లేయ‌ర్ మేనేజ‌ర్ పాత్ర‌లో నెపోలియ‌న్ క‌నిపించ‌నున్నారు. మ‌న్మోహ‌న్ క్యాబినేట్‌లో ఎంపీగా ప‌ని చేశారు నెపోలియ‌న్‌. హాలీవుడ్‌కి వెళ్ల‌బోతున్న తొలి త‌మీళియ‌న్‌గా ఆయ‌న కీర్తి పొందారు. చివ‌రిగా సీమ‌రాజా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.