జూలై 19న మిస్ట‌ర్ కెకెగా వ‌స్తున్న విక్ర‌మ్

mister kk on july 19

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ చివ‌రిగా సామి 2 అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇక ధృవ న‌క్ష‌త్రం అనే చిత్రంతో కొన్నాళ్ళుగా బిజీగా ఉంటున్నారు విక్ర‌మ్. ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న విడుద‌ల కాలేక‌పోయింది. రీసెంట్‌గా ఆయ‌న న‌టించిన ‘కదరం కొండన్’ అనే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ గా నటించాడు. అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో న‌టించింది. ఈ చిత్రం తెలుగులో మిస్ట‌ర్ కెకె పేరుతో విడుద‌ల కానుంది. జూలై 19న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం భాష‌ల‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ప్ర‌స్తుతం విక్ర‌మ్ మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్‌ కర్ణలో నటిస్తున్నారు. త్వరలో అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. మ‌రోవైపు విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్‌( ఆదిత్య వ‌ర్మ‌) తో వెండితెరకి ప‌రిచ‌యమ‌వుతున్న విష‌యం తెలిసిందే