హీరో కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి రోల్ అయినా కూడా కమల్ హాసన్ చాలా చక్కగా చేస్తూ ఉండేవారు . విక్రమ్ సినిమా ఆయనకి మంచి హిట్ ని తీసుకువచ్చింది. కమల్ హాసన్ కెరియర్ లో చాలా కష్టాలు వున్న యన్న విషయం ఎవరికి తెలియదు. ఒకానొక సమయంలో కమల్ హాసన్ సూసై** చేసుకోవాలని కూడా అనుకున్నారంట . 21 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు కమల్ హాసన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావట్లేదని గుర్తింపు రావట్లేదని ఫీల్ అయ్యి ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని ఇండస్ట్రీ చాల ఫీల్ అవుతుందని ఆయన అన్నారు. ఆయన గురువు అనంత్ కి కూడా అదే విషయం చెప్పానని కమల్ హాసన్ తెలియచేసారు . ఆ టైంలో గురువుగారు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో సరైన సమయంలో నీకు గుర్తింపు అదే వస్తుంది అని ఆయనకి చెప్పారట. అయితే ప్రాణం తీసుకోవడం మంచి నిర్ణయం కాదని… ఆయనకి అనిపించి ఆ టైంలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కమల్ హసన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కమల్ హాసన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.