‘కల్కి..’ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్ డేట్..!

Latest update on 'Kalki..' release date..!
Latest update on 'Kalki..' release date..!

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD అనే ఫాంటసీ సైంటిఫిక్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కల్కి మూవీ ని మొదట మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఐతే, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ నెలలో రిలీజ్ అనుకున్నారు. అది కూడా అసలు కుదరలేదు. ఇప్పుడు, తాజాగా మరో రిలీజ్ డేట్ వినిపిస్తుంది . తాజా అప్ డేట్ ప్రకారం, జూలై 2వ వారంలో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. శ్రీరామ నవమి రోజున అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.

Latest update on 'Kalki..' release date..!
Latest update on ‘Kalki..’ release date..!

కాగా ఈ మూవీ లో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే,ఈ భారీ-బడ్జెట్ మూవీ లో కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా మూవీ గా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ మూవీ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.