“లియో” సర్ప్రైజ్ ట్యూన్స్ రిలీజ్ చేసిన అనిరుద్.!

“లియో” సర్ప్రైజ్ ట్యూన్స్ రిలీజ్ చేసిన అనిరుద్.!
Cinema News

ప్రస్తుతం సౌత్ ఇండియా మ్యూజిక్ లవర్స్ సహా సినిమా లవర్స్ లో గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు “లియో”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు హీరో విజయ్ కాంబినేషన్ లో వీరితో పాటుగా తమ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో వచ్చిన ఈ సినిమా ఉన్న హైప్ ని ఆల్ మోస్ట్ అందుకున్నది . అయితే అంతా ఎక్కువగా ఎగ్జైట్ అయ్యిన పాయింట్ ఏదన్నా ఈ మూవీకి ఉంది అంటే అది సినిమాటిక్ యూనివర్స్ కోసమే అని చెప్పడంలో అసలు సందేహం లేదు.

“లియో” సర్ప్రైజ్ ట్యూన్స్ రిలీజ్ చేసిన అనిరుద్.!
Leo Movie

మరి లాస్ట్ టైం విక్రమ్ మూవీకే అనిరుద్ మాస్ డ్యూటీ చేసి క్రేజీ ట్యూన్స్ ని ఖైదీ, విక్రమ్ రోలెక్స్ థీమ్ లతో కలిపి అందించగా మూవీ లవర్స్ లో హైప్ ఎక్కడికో వెళ్ళింది. మరి ఇప్పుడు లియో మూవీ చూసిన వాళ్ళకి అయితే లోకి యూనివర్స్ 2.0 పరిచయం చేస్తూ కొట్టిన ట్యూన్ కానీ సినిమాలో మరికొన్ని సర్ప్రైజ్ ట్రాక్స్ తో డైరెక్ట్ గా థియేటర్స్ లోనే ఊహించని ట్రీట్ ని అందించారు.

ఇక ఈ క్రేజీ ట్యూన్స్ ని చాలా లేట్ గా వదలొచ్చు అని అంతా అనుకున్నారు కానీ అనిరుద్ మాత్రం వాటిని ముందే వదిలేసాడు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ అన్నింట్లో వదిలేసాడు. దీనితో ఇక ఈ ట్యూన్స్ ఇప్పుడు అందరి ప్లే లిస్ట్ ని రూల్ చెయ్యడం కూడా స్టార్ట్ చేసాయి.