నితిన్‌ను ఒప్పించిన ఫ్లాప్‌ డైరెక్టర్‌

Nithin And Sampath Nandi Combination In Next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘రచ్చ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సంపత్‌ నంది. ఆ తర్వాత పవన్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అవకాశం అయితే దక్కించుకున్నాడు కాని పవన్‌తో సినిమాను మాత్రం చేయలేక పోయాడు. పవన్‌తో సినిమా మిస్‌ అయిన తర్వాత రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని సంపత్‌ నంది తెరకెక్కించాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ఇటీవలే గోపీచంద్‌తో ‘గౌతమ్‌నంద’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం బిలో యావరేజ్‌గా వచ్చాయి.

సంపత్‌ నంది దర్శకత్వంలో మరే హీరో అయినా నటించేందుకు ఆసక్తి చూపిస్తాడా అని అంతా భావించారు. కాని యువ హీరో నితిన్‌ను సంపత్‌ నంది ఒప్పించాడు. ‘లై’చిత్రంతో కుదేళైన నితిన్‌ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా తన కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్న నితిన్‌ ఆ సినిమా పూర్తి అయిన వెంటనే సంపత్‌ నంది దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఆ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఒక్కడు మిగిలాడు లో ఇరగదీసిన మనోజ్ …

రాజమౌళి చేతుల మీదుగా మెగా151?