ఆ సినిమాను వదిలేసిన నితిన్…!

Nithin Left The Tamil Ratsasan Film

స్టార్ డైరక్టర్ రామ్ కుమార్ దర్శకత్వంలో తమిళంలో రాక్షసన్‌ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించారు. ఈ చిత్రం తమిళనాట ఘనమైన విజయాని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ లో నటించడానికి యువ హీరో నితిన్ ఆసక్తి కనబరిచాడు ఆ చిత్రానికి అడ్వాన్సు బుకింగ్ కూడా చేయించుకున్నాడు. తెలుగు యువ డైరక్టర్స్ కూడా రాక్షసన్‌ చిత్రాని రీమేక్ చెయ్యడానికి ఇంటరెస్ట్ చూపించారు. రాక్షసన్‌ ఒరిజినల్ నిర్మాతలు 4కోట్లకు కోట్ చేశారు.

ఈ మద్య తమిళ తెలుగు చిత్రాలు ఓ నెల గ్యాప్ లో అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ రాక్షసన్‌ సినిమాను తెలుగు వారు తమిళంలో విక్షించాడంతో అంత మొత్తంలో పెట్టి రీమేక్ రైట్స్ కొనడం కన్న సినిమానుండి తప్పుకోవడమే బెట్టర్ అనుకోని హీరో నితిన్ రాక్షసన్‌ రీమేక్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఇంకా ఇంతటితో ఆ రీమేక్ మూవీ కథ మరల మొదటికి వచ్చింది. ఒక్కవేల ఆ సినిమాను రీమేక్ చేసిన దగ్గరి పోలికలు ఉంటాయి కావున రీమేక్ చేసిన పలితం ఉండకపోవచ్చు అంటున్నారు. కానీ కొంతమంది కొత్త దర్శకులు మాత్రం ఆ సినిమాను రీమేక్ చెయ్యాలని గట్టి ప్రయత్నంతో ఉన్నారు. ఇప్పుడు రాక్షసన్‌ రీమేక్ నుండి నితిన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అసలకే హిట్ట్స్ లేక సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటరెస్ట్ చూపుతున్నట్లు సమాచారం. తనకు తెలిసిన కొంతమంది నిర్మాతలను తమిళ రాక్షసన్‌ ఒరిజినల్ నిర్మాతలతో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.