మరో రెండేళ్లు బిజీ…

Rashi Khanna to act in Nitin Satish Vegesna movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఇటీవల వరుసగా ఈ అమ్మడికి ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు పడుతున్నాయి. దాంతో ఈమె కెరీర్‌ చివరి దశకు వచ్చినట్లే అని అంతా భావించారు. గత నెలలో ఈమె నటించిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఈ అమ్మడు ‘తొలిప్రేమ’పై ఆశలు పెట్టుంకుంది. ఆమె ఆశలు వమ్ము కాలేదు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ సూపర్‌ హిట్‌ అయ్యింది. వెంకీ అట్లూరి ఈమెకు మంచి గుర్తింపు వచ్చే పాత్రను ఇచ్చాడు.

‘తొలిప్రేమ’ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా నటించిన ఈ అమ్మడు మంచి నటన కనబర్చడంతో పాటు గ్లామర్‌ పరంగా కూడా మెప్పించింది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తర్వాత రాశిఖన్నాకు నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దక్కలేదు. ఇన్నాళ్లకు ‘తొలిప్రేమ’ చిత్రంతో మరోసారి అవకాశం దక్కింది. వచ్చిన అవకాశంను దక్కించుకున్న రాశిఖన్నా కెరీర్‌లో మరో రెండు సంవత్సరాల పాటు ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోనుంది. ‘తొలిప్రేమ’ చిత్రం సక్సెస్‌తో నితిన్‌కు జోడీగా నటించే అవకాశం ఈ అమ్మడు దక్కించుకుంది. ఇంకా ఈమెకు పలు చిత్రాల్లో ఆఫర్లు రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి రాశిఖన్నాకు ‘తొలిప్రేమ’ జీవం పోసిందని చెప్పుకోవచ్చు.