‘ఎన్టీఆర్‌’ కోసం మరో హీరోయిన్‌

Ntr Biopic Movie Dubbing As Sr Ntr

బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఏయన్నార్‌ పాత్రలో సుమంత్‌, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌, శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్‌ ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్‌ హీరోయిన్‌ కూడా కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంతో మంది హీరోయిన్స్‌ను చూపించేందుకు దర్శకుడు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సీనియర్‌ హీరోయిన్‌ జయప్రదను కూడా చూపించబోతున్నాడు.

rashi khanna

ఎన్టీఆర్‌ కెరీర్‌లో పలు చిత్రాల్లో జయప్రదతో నటించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆకుచాటు పిందతడిసే పాట ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా ఆ పాట అందరిని అరిస్తూనే ఉంటుంది. తాజాగా ఆ పాటను ఎన్టీఆర్‌ చిత్రంలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పాట దాదాపు నిమిషం పాటు ఉండబోతుంది. ఆ పాటలో జయప్రద మాదిరిగా కనిపించేందుకు రాశిఖన్నా ఎంపిక అయ్యింది. రాశిఖన్నా ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌గా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో ఈమె కూడా ఎన్టీఆర్‌లో భాగస్వామ్యం అవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతుంది. మొత్తానికి సినిమా నిండుగా స్టార్స్‌ ఉండబోతున్న కారణంగా ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

Rasi Khanna And NTR bio pic